Friday, 23 October 2020

Preity Zinta: అదే గదిలో ప్రతి నాలుగు రోజులకోసారి.. ఇప్పటికే 20 సార్లు! ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ హీరోయిన్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని కోవిడ్ -19 టెస్ట్ క్వీన్ అనిపించుకుంటోంది. ఈ మేరకు వరుసపెట్టి కరోనా టెస్టులు చేయించుకుంటోందట ఈ బ్యూటీ. అలా ఇప్పటికే 20 సార్లు ఫినిష్ అయిందని పేర్కొంటూ తాజాగా తాను చేయించుకుంటున్న వీడియోను షేర్ చేసింది ప్రీతి. ఐపీఎల్ క్రీడాకారులతో పాటు అందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరి సురక్షిత ఆరోగ్యానికి తోడ్పడే బయో బబుల్స్ రూల్స్ ఖచ్చితంగా పాటిస్తున్నానని తెలిపింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం దుబాయ్‌లో ఉన్న ప్రీతీ జింటా.. ఓకే గదిలో హోమ్ క్వారంటైన్ లోనే ఉంటూ నాలుగు రోజులకోసారి తాను కరోనా టెస్ట్ చేయించుకుంటున్నానని ఈ వీడియోలో తెలిపింది. బహుశా ఇది 20 వ సారి అనుకుంటా అంటూ ఓపెన్ అయింది. అలా టెస్టుల మీద టెస్టులు చేయించుకొని తను కోవిడ్ టెస్ట్ క్వీన్ అయిపోయానని ఆమె చమత్కరించింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. Also Read: ఇక బయో బబుల్స్ రూల్స్ గురించి చెబుతూ.. బయటి ప్రపంచానికి దూరంగా ఎలాంటి వైరస్ లేని పరిస్థితులతో కూడిన వాతావరణమే బయో బబూల్ అని చెప్పింది. ఆరు రోజుల క్వారంటైన్, నాలుగు రోజులకోసారి కోవిడ్ టెస్టులు చేయించుకోవడం, మనకు కేటాయించిన గదికే పరిమితం కావడం బబుల్స్ రూల్స్ అని పేర్కొంది. జట్టుకు కేటాయించిన రెస్టారెంట్, జిమ్, స్టేడియంను మాత్రమే ఉపయోగించడం ఇందులో చాలా ముఖ్యమైన అంశం అని చెప్పింది. అయితే ప్రీతి కోవిడ్ టెస్ట్ చేయించుకున్న తీరు చూసి వామ్మో ఇన్ని సార్లా? ఇది సరైంది కాదని అంటున్నారు నెటిజన్లు. ఇకపోతే సాధారణంగానే క్రికెట్‌ని బాగా ఇష్టపడే ప్రీతి జింటా ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహా యజమనిగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమె టీమ్ పాయింట్స్ టేబుల్‌లో 6వ స్థానంలో ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3me4UIb
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...