Tuesday, 27 October 2020

Prabhas: లేడీ కొరియోగ్రాఫర్‌తో చిల్ అవుతున్న ప్రభాస్.. విదేశాల్లో అలా! ఫోటోలు వైరల్

యంగ్ రెబల్ స్టార్ ప్రస్తుతం ఇటలీ వీధుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. తన కొత్త సినిమా '' షూటింగ్ నిమిత్తం ఇటీవలే ఇటలీ ఫ్లైటెక్కిన ఆయన.. ఓ వైపు షూటింగ్ కంప్లీట్ చేస్తూనే ఇటలీ వీధులను చుట్టేస్తున్నారు. తాజాగా అందుకు సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విదేశాల్లో డార్లింగ్ స్టైలిష్ లుక్స్ చూసి ఫిదా అవుతున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. లేడీ కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్‌తో కలిసి ప్రభాస్ ఇటలీలో చిల్ అవుతున్నారు. అక్కడి అందమైన ప్రదేశాలు విజిట్ చేస్తూ 'రాధే శ్యామ్' యూనిట్‌తో కలిసి సరదా సమయాన్ని గడుపుతున్నారు. ఇకపోతే ఇప్పటికే విడుదలైన రాధే శ్యామ్ పోస్టర్లు, వీడియోలు ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. అభిమానుల అంచనాలు అందుకునేలా విదేశాల్లో భారీ హంగులతో షూటింగ్ జరుపుతోంది చిత్రయూనిట్. Also Read: జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని రొమాంటిక్ ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. కృష్ణం రాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి నిర్మాణంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. భాగ్య శ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ కేటాయించి ప్యాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ, మలయాళీ, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ అయింది. ఇటీవలే ఇటలీ చేరుకున్న చిత్రయూనిట్ మిగిలిన భాగాన్ని కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. ఇది పూర్తికాగానే విఫ్‌ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వర త్వరగా పూర్తిచేసి సర్వ హంగులతో ఈ 'రాధే శ్యామ్' రిలీజ్ చేస్తామని అంటున్నారు మేకర్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31OCHQm
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...