Monday, 26 October 2020

Nayanthara: ఆన్‌లైన్ క్లాసుల మాట విని షాకైన అమ్మోరు తల్లి.. ట్రైలర్ రిలీజ్ చేసిన మహేష్ బాబు

సౌత్ ఇండియన్ లేడీ సూపర్‌స్టార్‌ మరోసారి విలక్షణ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అమ్మోరు తల్లిగా అలరించేందుకు సిద్ధమైంది. ఆమె కీలక పాత్రలో తెరకెక్కుతున్న తమిళ చిత్రం ‘మూకుతి అమ్మన్‌’. తెలుగులో పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్‌జె శ‌రవ‌ణ‌న్‌, ఆర్జే బాలాజీ‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ని విజయదశమి సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. ఆర్జే బాలాజీ తొలిసారి దర్శకత్వం వహిస్తూ, నయనతారతో కలిసి నటించిన 'అమ్మోరు తల్లి' మూవీ ట్రైలర్‌ రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంటూ చిత్ర బృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు అని పేర్కొన్నారు మహేష్ బాబు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా అమ్మోరుతల్లి ట్రైలర్ షేర్ చేశారు. దీపావళి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌‌లో నవంబరు 14 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఇకపోతే 2 నిమిషాల 30 సెకనుల నిడివితో ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ ట్రైలర్‌లో అమ్మోరు తల్లిగా నయనతార నటన అబ్బురపరుస్తోంది. ''దేవుడే లేడంటున్న వాడు ఓకే.. కానీ ఒక దేవుడిని పొగుడుతూ ఇంకో దేవుడుని తిట్టేవాడు చాలా డేంజర్'' అంటూ నయనతార చెప్పిన డైలాగ్, ''మీ శక్తితో ఆన్‌లైన్‌ క్లాస్‌ను క్యాన్సిల్‌ చేస్తారా?'' ఓ అమ్మాయి అమ్మవారిని అడగడంతో ఆమె ఆశ్చర్యపోవడం ఈ ట్రైలర్‌లో ఆసక్తికర సన్నివేశాలు. ఓ కుటుంబం కోసం అమ్మవారు ప్రత్యక్షమై ఎలాంటి వరాలు ఇచ్చింది? ఆ తర్వాత ఆ కుటుంబం ఎలా మారింది? అనే కథాంశంలో ఈ మూవీ రూపొందుతోంది. Also Read: దీంతోపాటు నయన్ తమిళంలో మరో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ 'నెట్రిక్కన్' (మూడో కన్ను)లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఆమె ప్రియుడు, ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్ శివన్ నిర్మిస్తుండగా.. 'గృహం' ఫేమ్ మిలింద్ రావ్ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ఫస్ట్‌‌లుక్ ప్రేక్షకాదరణ పొందింది.‌


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2FY7P8n
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...