Sunday, 11 October 2020

Drugs Case: పోలీసులకే చుక్కలు చూపిస్తున్న యంగ్ హీరోయిన్స్.. జైల్లోనే ఒకరిపై ఒకరు! ఇదో వింత సమస్య

కొన్ని సందర్భాలు అస్సలు ఊహించలేం. ఒకటి చేయబోతే మరొకటి అవుతుంటుంది. నిజ జీవితంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవుతూనే ఉంటుంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారట కన్నడ పోలీసులు. ప్రస్తుతం జైల్లో ఉన్న యంగ్ హీరోయిన్స్ సంజన, కలిసి పోలీసులకే చుక్కలు చూపిస్తున్నారట. ఈ వింత ఘటన శాండిల్‌వుడ్ వర్గాల్లో హాట్ ఇష్యూగా మారింది. శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన హీరోయిన్లు , రాగిణి ద్వివేదీలు జైల్లోనే గొడవ పడుతూ పోలీసులకు తల నొప్పిగా మారారని కన్నడ మీడియా పేర్కొంటోంది. బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉంటున్న రాగిణి, సంజన ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుం టూ క్షణం కూడా కుదురుగా ఉండటం లేదట. `నువ్వా.. నేనా?` అన్నట్లుగా సెల్లోనే పోట్లాడుకుంటూ పోలీసులే బిత్తరపోయేలా చేస్తున్నారట. Also Read: నిజానికి సంజన, రాగిణి మధ్య చాలా కాలంగా విభేదాలున్నాయని టాక్. ఒకరంటే ఒకరికి పడని ఈ ఇద్దరూ ఇప్పుడు ఒకే జైల్లో ఉండాల్సి వస్తుండటం పోలీసులకు చెప్పుకోలేని భారంగా మారిందని తెలుస్తోంది. రాగిణి తీరును తప్పుబడుతూ సంజన, సంజన తీరుపై ఫైర్ అవుతూ రాగిణి యమ చాడీలు చెప్పుకుంటూ ఫిర్యాదులు ఇస్తుండటంతో పోలీసుల మైండ్‌ బ్లాంక్ అవుతోందట. అర్ధరాత్రి వరకు నిద్రపోకుండా లైట్లు వేసుకుని పుస్తకాలు, దినపత్రికలు చూస్తున్న రాగిణి.. మళ్లీ ఉదయాన్నే నిద్రలేచి లైట్లు వేసుకొని యోగాసనాలు చేస్తోందట. దీంతో తనకు ఇబ్బందిగా ఉందని, నిద్ర పట్టడం లేదని సంజన ఫిర్యాదు చేస్తోందట సంజన. ఇదొక్కటే గాక ఎన్నో విషయాల్లో ఈ ఇద్దరిలో ఏ ఒక్కరూ వెనక్కి తగ్గకపోవడంతో వీళ్లిద్దరికీ త్వరగా వచ్చేయాలని పోలీసులే కోరుకునే పరిస్థితి వచ్చిందని సమాచారం. ఈ వింత సమస్య గురించి తెలిసి అయ్యో! పాపం పోలీసులు అంటున్నారు జనం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34E54RS
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...