Sunday, 11 October 2020

Amitabh Bachchan: బిగ్‌ బిపై ప్రశంసల వర్షం కురిపించిన చిరంజీవి.. టాలెంట్‌ని కొనియాడుతూ పోస్ట్

నేడు (అక్టోబర్ 11) బిగ్ బీ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా మెగాస్టార్ ప్రత్యేకంగా ఆయనకు ట్విట్టర్ వేదికగా బర్త్ డే విషెస్ పోస్ట్ చేస్తూ అమితాబ్ టాలెంట్‌ని కొనియాడారు. "నా ప్రియాతి ప్రియమైన పెద్దన్న, ఇండియన్‌ సినిమాకు బిగ్‌ బీ, టాలెంట్‌కి‌ పుట్టినిల్లు‌, నా గైడింగ్‌ లైట్‌, వన్‌ అండ్‌ ఓన్లీ అమితాబ్‌గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రేక్షకులను ఆనందపరుస్తూ, మమ్మల్ని ఉత్తేజపరుస్తూ ఇలాగే మరెన్నో పుట్టినరోజులను జరుపుకోవాలని కోరుకుంటున్నాను" అని చిరంజీవి పేర్కొన్నారు. ఈ పోస్ట్ చూసిన మెగా అభిమానులు బిగ్ బీకి వెల్లువలా చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. Also Read: బాలీవుడ్‌లో టాప్ స్టార్‌గా ఎదిగిన అమితాబ్ బచ్చన్ తొలిసారి చిరంజీవి ప్రతిష్టాత్మక సినిమా 'సైరా నరసింహా రెడ్డి'తో టాలీవుడ్ గడప తొక్కారు. ఈ సినిమాలో ఫుల్‌లెంగ్త్ రోల్ పుషించిన ఆయన.. తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందారు. కాగా రీసెంట్‌గా అమితాబ్ తమ భారీ ప్రాజెక్టులో భాగమవుతున్నట్లు ప్రకటించారు నాగ్ అశ్విన్. ప్రభాస్ హీరోగా తాను రూపొందిస్తున్న కొత్త సినిమాలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. దీంతో మరోసారి బిగ్ బీని తెలుగు తెరపై చూడాలని కుతూహల పడుతున్నారు ఆడియన్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nFjzxt
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...