Friday, 2 October 2020

ఇటలీ బాట పట్టిన టాలీవుడ్... ఆ సినిమాలన్నీ అక్కడే

చాలా కాలంగా తెలుగు సినిమాలు విదేశాల్లో తెరకెక్కించేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. కొన్ని సినిమాలైతే ఏకంగా ఫారిన్ బ్యాక్‌డ్రాప్‌తోనే తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చాలా సినిమాలు విదేశాల్లోనే తెరకెక్కాల్సి ఉంది. ప్రస్తుతం కరోనా నుంచి ప్రపంచం కోలుకుంటున్న తరుణంలో టాలీవుడ్‌లో సినిమాల సందడి నెలకొంది. ఆగిపోయిన సినిమాలన్నీ షూటింగులు జరుపుకుంటున్నాయి. మరోవైపు విదేశీ లొకేషన్లు కూడా రారమ్మని పిలుస్తున్నాయి. ప్రస్తుత సమయంలో షూటింగులకు అత్యంత అనువైన దేశంగా ఇటలీని మనవాళ్లు సెలక్ట్ చేసుకుంటున్నారు. విదేశాల నుంచి వచ్చేవాళ్లకు అక్కడ క్వారంటైన్ నిబంధనలు సులభంగా ఉంటుండటంతో వాళ్లు అక్కడికే క్యూ కట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న ‘రాధేశ్యామ్’ సినిమా మొత్తం యూరప్ బ్యాక్‌డ్రాప్‌లోనే సాగనుంది. దీంతో ఈ నెలలోనే యూనిట్ అక్కడికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటోంది. మరోవైపు నితిన్ రంగ్ దే సినిమాలో కొంత భాగం అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దేశానికి వెళ్లడం కష్టం కాబట్టి అమెరికా బదులు ఇటలీ బ్యాక్‌డ్రాప్‌ మార్చేసి అక్కడ షూటింగ్ చేసుకోవచ్చనే ఆలోచనలో యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. నితిన్ చేయబోయే బాలీవుడ్ ‘అంధాధూన్’ రీమేక్ కూడా కొద్దిరోజులు ఫారిన్‌‌లో షూట్ చేయాల్సి ఉందట. పనిలో పనిగా రెండు సినిమాలను ఇటలీలోనూ షూటింగ్ చేస్తే బాగుంటుందన్న ఆలోచనగా తెలుస్తోంది. అయితే మహేష్‌బాబు ‘సర్కారువారిపాట’ సినిమాకు అమెరికా బ్యాక్‌డ్రాప్‌ ఎక్కువ భాగం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కొద్దిరోజులు ఆగైనా సరే అమెరికాలోనే షూటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. మొత్తానికి ఎక్కువ సినిమాలు ఇటలీలో షూటింగ్ చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతున్నట్లు టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3l8yLRP
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...