Tuesday, 20 October 2020

నన్ను ‘జెనీలియా భర్త’ అని పిలిచారు.. ఇగో హర్ట్ అయింది: రితేష్

టాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస సినిమాలతో క్రేజీ హీరోయిన్‌గా కొనసాగింది జెనీలియా. ముఖ్యంగా ‘బొమ్మరిల్లు’ సినిమాలో హాసిని పాత్ర ఇప్పటికే ప్రేక్షకులు మరిచిపోలేదు. ఆ తర్వాత బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లయింది. హిందీలో పాపులర్ టీవీ ప్రోగ్రామ్ ‘ది కపిల్‌ శర్మ కామెడీ షో’కు ఈ వారం , రితేష్‌ అతిధులుగా రాబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను సోనీటీవీ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా రితేష్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. Also Read: ‘బెంగుళూరులో ఓసారి క్రికెట్‌ లీగ్‌ చూడటానికి వెళ్లినప్పుడు అక్కడ ఇద్దరు క్రికెటర్లు గుసగుసలాడుకొని ‘మీరు జెనీలియా భర్త కదా’ అని అడిగారు. ఆ మాటకు నా ఇగో కొంచెం హర్ట్ అయ్యింది. అప్పుడు నేను వాళ్తతో ‘చూడండి ఇక్కడ నేను జెనీలియా భర్తను అయితే మహారాష్ట్రలో ఆమె రితేష్‌ భార్య’ అని చెప్పా. అప్పుడు వారు.. చూడండి ఒక్క మహారాష్ట్రలోనే జెనీలియాను రితేష్‌ భార్య అంటారు. కానీ కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో మిమ్మల్ని జెనీలియా భర్త అనే అంటారు అని సమాధానం ఇచ్చారు’ అని రితేష్ చెబుతున్నారు. దీంతో ఆ షో వ్యాఖ్యాతలతో పాటు అందులో పాల్గొన్న వారంతా తెగ నవ్వేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3m5INn7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...