ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు వారసుడిగా ‘కలియుగ పాండవులు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు వెంకటేష్. వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. శత చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ కాంబినేషన్లో ఆయన నటించిన ‘’ 2001 సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైంది. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. సుమంత్ ఆర్ట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అప్పటివరకు సూపర్‌హిట్ సినిమాలతో అగ్ర నిర్మాతగా కొనసాగిన ఎమ్మెస్ రాజును ‘దేవీపుత్రుడు’ సినిమా షాకిచ్చింది. అప్పట్లోనే ఆయనకు ఏకంగా రూ.14కోట్ల నష్టాన్ని మిగిల్చింది. అవును ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. మనసంతా నువ్వే సినిమా 19ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ లేఖ విడుదల చేసిన ఆయన దేవీపుత్రుడు సినిమా గురించి కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించారు. ‘2001 సంక్రాంతి... నా 'దేవీపుత్రుడు' రిలీజ్. ఒకటి రెండూ కాదు.. 14 కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు అయిపోయాయి. నేను పడిన కష్టం, నేను పెట్టుకున్న ఆశలు అంతా ఆవిరైపోయాయి. దెబ్బలు నాకు కొత్త కాదు... పరాజయాలు నాకు పరిచయం లేనివి కాదు... కానీ ఈ దెబ్బ, ఈ పరాజయం మాత్రం నన్ను బాగా కుంగదీసి పారేసింది. 'శత్రువు' సక్సెస్ ఇచ్చిన కిక్, 'దేవి' వల్ల వచ్చిన లైఫ్... ఇవన్నీ ఒక్క ఫెయిల్యూర్ తో స్మాష్. దానికితోడు కామెంట్లు. అంత బడ్జెట్‌తో సినిమా అవసరమా అని ఇంకెంతో మంది తిట్లు. బాగా కుంగిపోయాను నేను. దాన్నుంచి బయటకు రావడానికి పది రోజులు పట్టింది నాకు’ అని తెలిపారు ఎమ్మెస్ రాజు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3m1OjqQ
v
No comments:
Post a Comment