ఫైర్ బ్రాండ్ ఇటీవల వరుసగా వార్తల్లో నిలుస్తోంది. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణంతో బాలీవుడ్ మాఫియాపై గళమెత్తిన కంగనా ఎందరికో శత్రువుగా మారింది. మహారాష్ట్రలోని శివసేన సర్కారు కూడా ఆమెపై ఆగ్రహంతో ఆమె భవనాన్ని కూల్చేసింది. ఆ తర్వాత జయలలిత బయోపిక్ ‘తలైవి’ కోసం ఆమె హైదరాబాద్ చేరుకుని షూటింగులో పాల్గొంది. ఈ క్రమంలోనే కంగనాను ఉద్దేశిస్తూ ఓ న్యాయవాది ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టు ఇప్పుడు సంచలనంగా మారింది. వ్యవసాయ చట్టాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కంగనాపై కర్ణాటకలోని తుమకూరు జిల్లా క్యతాసంద్ర పోలీస్‌స్టేషన్లో కేసు నమోదైంది. బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశం మేరకు ముంబయి పోలీసులు ఆమెపై దేశద్రోహం కేసు పెట్టారు. ఈ క్రమంలోనే కంగనా తన సోదరుడి పెళ్లి వేడుకల ఫోటోలను సోషల్‌మీడియాలో షేర్ చేశారు. దీంతో ఒడిశాకు చెందిన ఓ లాయర్ కంగనాను నడిరోడ్డుపై రేప్ చేస్తానంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. Also Read: ఆ పోస్ట్ చూసి షాకైన నెటిజన్లు ఆయనకు చీవాట్లు పెట్టడంతో తన అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేశారని చెప్పుకొచ్చారు. తనకు మహిళలపై గౌరవం ఉందని, తన అకౌంట్‌లో పెట్టిన అసభ్యకర కామెంట్లు నొప్పిస్తే క్షమించాలని కోరారు. అనంతరం ఆ లాయర్ తన అకౌంట్‌ను డిలీట్ చేశారు. ప్రస్తుతం మనాలిలో ఉన్న కంగనా దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jbDa5a
v
No comments:
Post a Comment