Wednesday, 21 October 2020

‘సోలో బ్రతుకే సో బెటర్’ సెన్సార్ పూర్తి.. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు

సుప్రీమ్ హీరో , ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ జంటగా రూపొందిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. ఈ చిత్రం ద్వారా సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. బాపినీడు.బి సమర్పణలో శ్రీ వెంక‌టేశ్వర సినీ చిత్ర ఎల్‌.ఎల్‌.పి బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా బుధవారం సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ బోర్డు క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ విషయాన్ని సాయి తేజ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ‘‘అతి త్వరలో మీ ముందుకు..’’ అని పేర్కొన్నారు. నిజానికి ఈ సినిమా ఈపాటికే విడుదల కావాల్సింది. కాకపోతే, కరోనా వైరస్ వల్ల ఏర్పడిన లాక్‌డౌన్ కారణంగా ఆలస్యమైంది. సుమారు ఐదు నెలల విరామం తరవాత ఆగస్టు నెలాఖరులో ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. సింగిల్ షెడ్యూల్‌లో మిగిలిన భాగాన్ని, పాటలను చిత్రీకరించారు. ఇటీవల సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ‘అమృత’ అనే సాంగ్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టకున్నాయి. ఇక టీజర్, ట్రైలర్ రావాల్సి ఉంది. ‘ప్రతిరోజూ పండగే’ వంటి హిట్ మూవీ తరవాత సాయి తేజ్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో ‘సోలో బ్రతుకే సో బెటర్’పై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గుట్టుగానే సినిమాను రూపొందించినట్టు చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. వెంకటర్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ అందించారు. నవీన్ నూలి ఎడిటర్. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35ioXOR
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...