Monday, 19 October 2020

కెరీర్‌ సూపర్ కానీ మ్యారీడ్ లైఫే.. అక్కినేని వారబ్బాయి ఇలా అంటున్నాడేంటి బాబూ! బ్యాలెన్స్ తప్పిందా?

అబ్బాయి లైఫ్‌లో 50 శాతం కెరీర్, 50 శాతం మ్యారేజ్ లైఫ్ ఉంటుందంటూ ఓపెన్ అయ్యాడు . టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టులో ఒకడైన ఈ స్టార్ కిడ్ పెళ్లి గురించి మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. ఓ వైపు తన లేటెస్ట్ మూవీ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'ని ప్రమోట్ చేస్తున్న మరోవైపు తన మ్యారేజ్ లైఫ్, కెరీర్ గురించి ప్రస్తావించడం ప్రేక్షకులకు ఆకర్షిస్తోంది. ''అఖిల్, హలో, మిస్టర్ మజ్ను'' సినిమాలతో అలరించిన అక్కినేని అఖిల్ తన నాలుగో సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణలో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో అఖిల్ సరసన యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ అతిత్వరలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన ఈ బ్యాచిలర్ కుర్రోడు తాజాగా ప్రీ టీజర్‌తో పలకరించాడు. Also Read: ''హాయ్ ఐ యామ్ హర్ష.. ఒక అబ్బాయి లైఫ్‌లో 50 శాతం కెరీర్, 50 శాతం మ్యారేజ్ లైఫ్. కెరీర్‌ను సూపర్‌గా సెట్ చేశా కానీ ఈ మ్యారీడ్ లైఫే.. అయ్యయ్యయ్యయ్యో'' అంటూ బ్యాలెన్స్ తప్పిందన్నట్లుగా ఓపెన్ అయ్యాడు. ఈ వీడియో అఖిల్ సినిమాకు బెస్ట్ ప్రమోషన్‌గా నిలుస్తూనే, రియల్ లైఫ్‌కి కూడా కాస్త సింక్ అవుతుండటంతో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ఫుల్ టీజ‌ర్‌ను ఈ నెల 25న ఉదయం 11.40 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు ఈ వీడియో ద్వారా ప్రకటించారు మేకర్స్. ఇక అఖిల్ పెళ్లి విషయానికొస్తే.. అప్పట్లోనే శ్రేయా భూపాల్‌తో అఖిల్ పెళ్లి ఫిక్స్ అయి అనూహ్యంగా క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే. దానికి కారణాలేంటనేది అఫీషియల్‌గా తెలియనప్పటికీ అప్పటి నుంచి అఖిల్ పెళ్లి మ్యాటర్ జనాల్లో హాట్ ఇష్యూ గానే నడుస్తోంది. ఇక రీసెంట్‌గా ఓ ఫేమస్ బిజినెస్‌మెన్ కూతురితో అఖిల్ పెళ్లి ఫిక్స్ కూడా చేసేశారని టాక్ నడుస్తోంది. సరిగ్గా ఈ సమయంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' రూపంలో అఖిల్ ప్రేక్షకుల ముందుకొస్తుండటం మరింత ఆసక్తికరంగా మారింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Hcz3J5
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...