Tuesday, 13 October 2020

బీజేపీలో చేరనున్న హీరో విజయ్ తండ్రి.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ గెలుపు వ్యూహాలు రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖులను తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ దూసుకుపోతోంది. ముఖ్యంగా సినీ ప్రముఖులపై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గౌతమి, రాధారవి, కస్తూరి రాజా, గాయత్రి రఘురామ్ వంటి వారికి గాలం వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరో ప్రముఖ వ్యక్తి బీజేపీలోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. Also Read: ఆయనెవరో కాదు తమిళ సూపర్‌స్టార్ విజయ్ తండ్రి, దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్. అవును చంద్రశేఖర్ బీజేపీలో చేరనున్నారని ఓ వర్గం, ఆయన ఆల్రెడీ కమలం పార్టీ సభ్యత్వం తీసేసుకున్నారని మరో వర్గం ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారం గురించి తెలుసుకున్న ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరలేదని, ఇప్పట్లో రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. Also Read: ఇటీవల విజయ్ సినిమాలు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ తీసే సినిమాలు తీస్తుండటంతో విజయ్ సినిమాలపై చర్చ జరుగుతోంది. ఇటీవలే ‘మాస్టర్’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న సమయంలో విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. విజయ్‌పై కక్షతోనే ఈ దాడులు చేశారంటూ ఆయన అభిమానులు అప్పట్లో విమర్శలు గుప్పించారు. తాజాగా విజయ్ తండ్రి బీజేపీలో చేరనున్నారన్న వార్త తమిళనాడ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dnOnhD
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...