‘అల వైకుంఠపురములో’ సినిమాతో బుట్టబొమ్మగా మారిపోయిన .. ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ప్రస్తుతం ప్రభాస్‌తో ‘రాధేశ్యామ్’, అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రాల్లో నటిస్తున్న పూజాకు ఇంకా అనేక ఆఫర్లు వరుస కడుతున్నాయి. ఇటీవల కాలంలో ఆమె నటించిన సినిమాలన్నీ సూపర్‌హిట్లు సాధించడంతో హీరోలు, దర్శక నిర్మాతలు ఆమెను లక్కీ హీరోయిన్‌గా భావిస్తున్నారు. పూజా ఉంటే బొమ్మ హిట్టే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. Also Read: దీంతో ఈ బ్యూటీకి తెలుగులో ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది. బాలీవుడ్లో కూడా వరుస ఆఫర్లు వస్తుండటంతో అమ్మడు రెమ్యునరేషన్ విషయంలో చెట్టెక్కి కూర్చున్నట్లు సమాచారం. అడిగినంత ఇస్తేనే సినిమా చేస్తానని కరాఖండిగా చెప్పేస్తోందట. దానికి తోడు గతంలో కంటే రెమ్యునరేషన్ డబుల్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు తన వద్దకు వచ్చే దర్శక నిర్మాతలకు రూ.2.5-3 కోట్ల వరకు ఇవ్వాలని చెప్పడంతో నోరెళ్లబెడుతున్నారట. కరోనా ఎఫెక్ట్‌తో సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో పెద్ద నటులు, టెక్నీషియన్స్ పారితోషికంలో కోత విధించుకోవాలని ఇండస్ట్రీలో తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొందరు హీరో, హీరోయిన్లు తమ పారితోషికాలను తగ్గించుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో పూజా హెగ్డే తీరు ఎవరికీ అంతుబట్టడం లేదంట. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2HHcMDf
v
No comments:
Post a Comment