కోదండరామిరెడ్డి... తెలుగు సినిమా చరిత్రలో అత్యంత సక్సెస్ రేటు సాధించిన దర్శకుల్లో ఒకరు. 1980-90 దశకాల్లో అగ్ర హీరోలతో వరుసగా సినిమాలు తెరకెక్కించి టాప్ డైరెక్టర్ హోదాను అనుభవించారు. దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, కోడి రామకృష్ణ లాంటి దర్శకుల పోటీని తట్టుకుని ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారాయన. హీరో అవుదామని సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన దర్శకుడుగా మారి 93 చిత్రాలు తెరకెక్కించారు. వాటిలో 80 సినిమాలు సూపర్‌హిట్లు కావడం ఓ సంచలనం. చిరంజీవితో తీసిన ‘ఖైదీ’ ఇండస్ట్రీ సాధించడానికి కారణం ఆయన దర్శకత్వ ప్రతిభే. కోదండరామిరెడ్డి టాప్ దర్శకుడిగా కొనసాగుతున్న సమయంలోనే అగ్రహీరోగా ఉన్నారు. ఓ సమయంలో శోభన్‌బాబుతో మాట్లాడుతూ.. ఆయన ఆస్తిలో సగం తన పేరిట రాసివ్వాలని కోదండరామిరెడ్డి అడిగారట. ఏంటి షాకయ్యారా?. అసలు ఆయన అలా ఎందుకు అడిగారో ఇప్పుడు తెలుసుకోంది. అప్పట్లో కోదండరామిరెడ్డి, శోభన్‌బాబు దూరం నుంచి చూస్తే ఒకేలా ఉండేవారట. ఇద్దరికీ కాస్త పోలికలు ఉండటంతో కొత్త వ్యక్తులు పొరపడేవారట. దీంతో కోదండరామిరెడ్డి అందరూ నెల్లూరు శోభన్‌బాబు అని పిలిచేవారట. ఈ విషయం తెలుసుకున్న శోభన్‌బాబు.. ఒకానొక సందర్భంగా ఆయనతో మాట్లాడుతూ మీకూ నాకూ పోలికలున్నాయిన చెప్పారట. దీంతో స్పందించిన కోదండరామిరెడ్డి ‘అయితే మీ ఆస్తిలో సగం నాకు రాసివ్వండి’ అని జోక్ చేశారు. దీంతో శోభన్‌బాబు నవ్వాపుకోలేకపోయారట. ఈ విషయాన్ని కోదండ రామిరెడ్డి ఓ ఇంటర్వ్యూ సందర్భంలో చెప్పుకొచ్చారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2HCdcuu
v
No comments:
Post a Comment