హీరోయిన్లకు సినిమా అన్నాక శృంగార సన్నివేశాల్లో నటించడం, అడల్ట్ సన్నివేశాల్లో రెచ్చిపోవడం తప్పనిసరి. ముఖ్యంగా హీరోయిన్స్ కెరీర్‌లో గ్లామర్ ట్రీట్ అనేది చాలా ముఖ్యం. అయితే కెరీర్ కోసం అలాంటి వాటికి వెనకాడని హీరోయిన్స్ పెళ్లయ్యాక మాత్రం కాస్త ఇబ్బంది పడుతుంటారు. ఓ సారి సినిమా రిలీజ్ అయ్యిందంటే ఆ సినిమా వందేళ్లైనా ప్రదర్శితమవుతూనే ఉంటుంది కాబట్టి హీరోయిన్లు అప్పట్లో ఆరబోసిన అందాలు, వారి వారి పిల్లలకు కాస్త ఇబ్బందిగానే ఉంటాయి. సరిగ్గా అదే విషయం చెబుతూ ఓపెన్ అయింది హీరోయిన్ . ఒకానొక సమయంలో బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ జుహీ చావ్లా. బాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ నటించి గ్లామరస్ హీరోయిన్‌గా క్రేజ్ కొట్టేసింది. నటన, కామెడీ టైమింగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె హిందీతో పాటు పంజాబీ, మళయాళం, కన్నడ, తమిళ్, తెలుగు, బెంగాలీ భాషల్లోనూ నటించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన ఆమె తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన సినిమాల పట్ల పిల్లల ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చెప్పుకొచ్చింది. Also Read: తన పిల్లలు జాహ్నవి, అర్జున్ తాను నటించిన సినిమాలు చూడడానికి ఇబ్బందిపడతారని చెబుతూ ఓపెన్ అయింది జుహీ చావ్లా. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో తాను చేసిన సినిమాలు చూడటానికి వాళ్లు ఇష్టపడరని, వాటిలో తాను నటించిన రొమాంటిక్ సీన్స్ ఉంటాయి కాబట్టి ఆ సినిమాలను చూడరని చెప్పింది. ఒకవేళ ఏదైనా సినిమా చూడాలనుకున్నా.. ముందుగానే `అమ్మా ఆ మూవీలో ఏమైనా రొమాంటిక్ సీన్లు ఉంటాయా` అని అడుగుతారని చెప్పింది. అమ్మా నిన్ను రొమాంటిక్ సీన్లలో చూడడం నాకు నచ్చదని కొడుకు అర్జున్ అంటుంటాడని జుహీ చావ్లా తెలపడం విశేషం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cYmz3r
v
No comments:
Post a Comment