Friday, 23 October 2020

‘ఆకాశం నీ హద్దురా’ విడుదల అందుకే ఆలస్యం.. అసలు విషయం చెప్పిన సూర్య

పలు అనుమతులు పొందాల్సి ఉన్నందున ‘ఆకాశం నీ హ‌ద్దురా’ చిత్రం విడుద‌లలో జాప్యం జ‌రుగుతోంద‌ని హీరో తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ లెట‌ర్ పోస్ట్ చేశారు. వాస్తవానికి ఆ చిత్రాన్ని అక్టోబ‌ర్ 30న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌ల చేయ‌నున్నట్లు ఇదివ‌ర‌కు ప్రక‌టించారు. కానీ, ఇప్పుడు విడుదల ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో, ‘ఆకాశం నీ హ‌ద్దురా’ (సూరారై పొట్రు) చిత్రం విడుద‌ల‌లో జాప్యం జ‌ర‌గ‌డానికి కార‌ణాల‌ను, తాము ఎదుర్కొంటున్న ప‌రిస్థితుల‌ను తన బహిరంగ లేఖలో సూర్య వెల్లడించారు. ‘ఆకాశం నీ హ‌ద్దురా’ (సూరారై పొట్రు) సినిమాను మొదలుపెట్టినప్పుడు ఇదివ‌ర‌కెన్నడూ షూటింగ్ జ‌ర‌ప‌ని లొకేష‌న్లలో చిత్రీకరణ చేయ‌డం, భిన్న భాష‌ల‌కు చెందిన, భిన్న సామ‌ర్థ్యాలున్న వ్యక్తుల‌తో ప‌నిచేయ‌డం అనేవి మాత్రమే త‌మ ముందున్న స‌వాళ్లని భావించామ‌ని సూర్య తెలిపారు. అయితే, వాటిని ఎగ్జిక్యూట్ చేయ‌డం చాలా పెద్ద విష‌యం అని ఈజీగా చెప్పవ‌చ్చని సూర్య అన్నారు. ‘‘ఆకాశం నీ హ‌ద్దురా చిత్రం వైమానిక రంగం నేప‌థ్యంలో న‌డిచే క‌థ అని అంద‌రికీ తెలుసు. కాబ‌ట్టి మేం అనేక నియమాలను పాటించాల్సి వ‌చ్చింది. అనుమతులు తీసుకోవాల్సి వచ్చింది. ఇది జాతీయ భ‌ద్రత‌కు సంబంధించిన వ్యవ‌హారం. మేం నిజ‌మైన ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ యుద్ధ విమానాలు, సెక్యూరిటీతో డీల్ చేయాల్సి వ‌చ్చింది. కొన్ని ఎన్ఓసీలు (నో అబ్జెక్షన్ స‌ర్టిఫికెట్లు) అనుమ‌తుల కోసం ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నిరీక్షణ అనివార్యమ‌ని మేం అర్థం చేసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న మ‌హ‌మ్మారి కాలంలో మిగ‌తా అన్ని విష‌యాల కంటే దేశం, దాని ప్రాధాన్యాల మీదే అధిక‌ దృష్టి పెట్టాలి’’ అని సూర్య పేర్కొన్నారు. ‘ఆకాశం నీ హ‌ద్దురా’ త‌మ మనసులకు బాగా దగ్గరైన సినిమా అని సూర్య అన్నారు. ఈ స్ఫూర్తిదాయ‌క క‌థ విష‌యంలో తామెంతో ఉద్వేగాన్ని ఫీల‌వుతున్నామ‌న్నారు. ‘‘దురదృష్టవ‌శాత్తూ, ఈ సినిమా విడుద‌ల కోసం ఊహించిన దానికంటే మ‌రికొంత ఎక్కువ స‌మ‌యం వేచి ఉండాల్సి వ‌స్తోంది’’ అని సూర్య ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా, త‌న శ్రేయోభిలాషులు ఈ చిత్రం కోసం ఎంత ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారో తెలుస‌ని, కానీ త‌మ‌కు వేరే దారి లేక‌పోవ‌డం బాధగా ఉందని అన్నారు. ‘‘ఈ జాప్యాన్ని నా శ్రేయోభిలాషులు అర్థం చేసుకుంటార‌ని ఆశిస్తున్నాను’’ అని సూర్య అన్నారు. అన్ని అనుమ‌తులూ లభించి విడుద‌ల‌కు సిద్ధమ‌య్యాక తేదీని ప్రకటిస్తామని.. ఈలోగా ట్రైల‌ర్‌, మ‌రిన్ని విష‌యాల‌తో ప్రేక్షకుల ముందుకు వ‌స్తామ‌ని ఆయ‌న వెల్లడించారు. ‘‘ఈ లెట‌ర్‌తో పాటు మ‌న స్నేహం, ప్రేమ‌, అనురాగాల‌కు అంకిత‌మిస్తూ అంద‌మైన ‘ఫ్రెండ్‌షిప్ సాంగ్‌’ను అందిస్తున్నా’’ అని పేర్కొన్నారు సూర్య. ఎయిర్ ద‌క్కన్ వ్యవ‌స్థాప‌కుడు జి.ఆర్‌. గోపీనాథ్ జీవితంలో ఎదుర్కొన్న ఘ‌ట‌న‌లు, క‌ష్టాల‌ను ఆధారం చేసుకొని రూపొందిన ‘ఆకాశం నీ హ‌ద్దురా’ చిత్రంలో సూర్య, డాక్టర్ మోహ‌న్‌బాబు, అప‌ర్ణా బాల‌ముర‌ళి ప్రధాన పాత్రధారులు. సుధ కొంగ‌ర డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని 2డి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, శిఖ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై సూర్య, గునీత్ మోంగా నిర్మించారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Hjn7Wc
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...