Friday, 23 October 2020

'అర్ధ శతాబ్దం' పుష్ప లుక్ రిలీజ్.. బతుకమ్మ చేతబట్టి అచ్చ తెలుగు అమ్మాయిగా ఆకర్షించిన హీరోయిన్

రిషిత శ్రీ క్రియేషన్స్ బ్యానర్‌పై కార్తిక్ రత్నం, కృష్ణ ప్రియ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం `అర్ద శతాబ్ధం`. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అందాల రాక్ష‌సి ఫేం నవీన్ చంద్ర పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. చిట్టి కిరణ్ రామోజు నిర్మిస్తున్నారు. గత కొంతకాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ప్రస్తుతం చివరి దశకు వచ్చింది. దీంతో సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు వేగవంతం చేసిన చిత్రయూనిట్.. ఇటీవలే రానా చేతుల మీదుగా మూవీ ఫ‌స్ట్ గ్లింప్స్ విడుదల చేసి ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఇక తాజాగా బ‌తుక‌మ్మ సంబరాల‌ సంద‌ర్భంగా `పుష్ప‌` పాత్ర లుక్‌ని ప్ర‌ముఖ న‌టి శ్రీ‌దివ్య లాంచ్ చేశారు. ఈ మేరకు ప్రేక్షక లోకానికి బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు యూనిట్ సభ్యులు. Also Read: పుష్ప పాత్రలో నటిస్తున్న హీరోయిన్ కృష్ణ ప్రియ ఈ లుక్‌తో యువ హృదయాలకు దగ్గరైంది. పాశ్చాత్య సంసృతి మాయలో పడి చిట్టిపొట్టి దుస్తులతో గ్లామర్‌కే ప్రాధాన్యత ఇస్తున్న ఈ రోజుల్లో.. కృష్ణ ప్రియ ఇలా అచ్చ తెలుగు అమ్మాయిలా బతుకమ్మ చేతబట్టి కనిపించడం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. దీంతో అన్ని వ‌ర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుత స్పంద‌న వ‌స్తోంది. ఇకపోతే కేరాఫ్ కంచెరపాలెం సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తిక్ రత్నం ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ నారప్పలో వెంకటేష్ కుమారుడిగా నటిస్తున్నారు. అలాగే ఈ 'అర్థ శతాబ్దం' సినిమాలో వైవిధ్యమైన పాత్రతో అలరించబోతున్నాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37A3ymY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...