Friday, 2 October 2020

కశ్యప్ నేరం ఒప్పుకోవాలంటే ఇలా చేయండి: పోలీసులకు పాయల్ సలహాలు

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌పై లైంగిక ఆరోపణలు చేసి సంచలనం రేపిన నటి అతడిని వదిలిపెట్టేలా కనిపించడం లేదు. సినిమా ఛాన్స్ కోసం వెళ్లిన తనకు బ్లూఫిలిమ్ చూపించి కశ్యప్ లైంగికంగా వేధించారంటూ పాయల్ సంచలనం ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఆమె పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసిన ముంబయిలోని వెర్సోవా పోలీసులు ఆయన్ని శుక్రవారం 8 గంటల పాటు విచారించారు. ఈ సందర్భంగా పాయల్ ఘోష్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని కశ్యప్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఆమె ఆరోపించినట్లు ఆ సమయంలో తాను అసలు ఇండియాలో లేనని స్పష్టం చేశారని సమాచారం. ఈ విషయంపై స్పందించిన పాయల్ ఘోష్ మరోసారి ఘాటుగా ట్వీట్ చేసింది. పోలీసులు విచారణలో కశ్యప్ అన్నీ అబద్ధాలే చెప్పారని, వాస్తవాలు బయటపడాలంటే ఆయనకు నార్కో అనాలిసిస్, లై డిటెక్టర్, పాలిగ్రాఫ్ టెస్టులు నిర్వహించాలని కోరుతున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించి తన న్యాయవాది పోలీస్‌స్టేషన్లో అప్లికేషన్ ఇవ్వనున్నారని తెలిపారు. Also Read: పాయల్ ట్వీట్ స్పందించిన కశ్యప్ ఆమె ఆరోపణలను ఖండించారు. 2013 ఆగ‌స్ట్‌ నెలలో షూటింగ్ నిమిత్తం తాను శ్రీలంక‌కు వెళ్లిన‌ట్టు చెప్పుకొచ్చాడు. అందుకు సంబంధించిన ఆధారాల‌ను పోలీసుల‌కు ఇచ్చిన‌ట్లు తెలిపారు. పాయల్‌తో ఎప్పుడూ అసభ్యంగా ప్రవర్తించలేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34lSrL5
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...