Monday, 19 October 2020

‘మ‌హాస‌ముద్రం’లో మరో బ్యూటీ.. అను ఇమ్మానుయేల్‌కు ఛాన్స్

విల‌క్షణ పాత్రల‌తో ప్రేక్షకుల హృద‌యాల‌ను గెలుచుకున్న హీరో శ‌ర్వానంద్‌. అలాగే, ప్రతిభావంతుడైన న‌టుడిగా, లవర్ బోయ్‌గా పేరు తెచ్చుకున్న హీరో సిద్ధార్థ్. వీరిద్దరి క‌ల‌యిక‌లో రూపొందుతోన్న చిత్రం ‘మ‌హాస‌ముద్రం’. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజ‌య్ భూప‌తి ద‌ర్శక‌త్వంలో ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇంకా సెట్స్‌ మీదకు వెళ్లని ఈ సినిమా నుంచి వరుస ప్రకటనలు వెలువడుతున్నాయి. ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉన్న త‌న చిత్రంలోని ప్రధాన పాత్రల కోసం స‌రైన న‌టుల‌ను ఎంపిక చేస్తూ వ‌స్తున్నారు ద‌ర్శకుడు అజ‌య్ భూప‌తి. క‌థ‌కు కీల‌క‌మైన ఒక హీరోయిన్ పాత్ర కోసం ఇప్పటికే టాలెంటెడ్ యాక్ట్రెస్‌ అదితి రావు హైద‌రిని ఎంపిక చేశారు. కాగా, లేటెస్ట్‌గా అందాల తార అను ఇమ్మానుయేల్‌ను మ‌రో హీరోయిన్ రోల్ కోసం ఎంపిక చేశారు. ఆమెది కూడా ప్రాధాన్యం ఉన్న పాత్ర. నిజానికి ప్రతి క్యారెక్టర్‌కూ ప్రాధాన్యం ఉండేలా స్క్రిప్ట్‌ను తీర్చిదిద్దారు అజ‌య్ భూప‌తి. Also Read: ఇంటెన్స్ ల‌వ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకోనున్న ‘మ‌హాస‌ముద్రం’ను ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్రహ్మం నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులను త్వరలోనే ప్రకటించనున్నారు. ‘ఆర్ఎక్స్ 100’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరవాత అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తోన్న చిత్రం కావడంతో ‘మహాసముద్రం’పై అంచనాలు భారీగానే ఉన్నాయి. దీనికి తోడు మంచి తారాగణం సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Heidt9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...