Tuesday, 6 October 2020

ఆగస్టులో జరిగిన పెళ్లి.. ఇప్పుడు బయటపెట్టి షాకిచ్చిన హీరోయిన్

కరోనా భయాందోళన పరిస్థితుల్లో ఎంతో మంది సినీ తారలు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో హీరోయిన్ నీతి టేలర్ కూడా చేరారు. కాకపోతే, ఈమె ఆగస్టులో పెళ్లి చేసుకుని ఇప్పుడు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ‘పెళ్లి పుస్తకం’, ‘మేం వయసుకు వచ్చాం’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ఢిల్లీ బ్యూటీ ఆగస్టు 13న ఆర్మీ ఆఫీసర్ పరిక్షిత్ బవాను పెళ్లాడారు. ఈ విషయాన్ని సుమారు రెండు నెలల తరవాత సోసల్ మీడియా ద్వారా నీతి టేలర్ ప్రకటించారు. గుర్గావ్‌లోని గురుద్వారాలో చాలా కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో తమ వివాహం జరిగినట్టు నీతి వెల్లడించారు. ఈ వేడుకలో తమ తల్లిదండ్రులు, సన్నిహితులు మాత్రమే హాజరైనట్టు పేర్కొన్నారు. ఇది కొవిడ్ వెడ్డింగ్ అని సరదాగా అన్నారు. అయితే, తాను పెళ్లిచేసుకున్న విషయాన్ని ఆలస్యంగా చెప్పడానికి గల కారణాన్ని కూడా నీతి వెల్లడించారు. కొవిడ్-19 పరిస్థితి త్వరలోనే చక్కబడుతుందని భావించామని, గ్రాండ్ ఫంక్షన్ ఏర్పాటుచేసి చెబుదామనుకున్నామని.. కానీ ఈ ఏడాదికి ఇది వదిలేలా లేదు కాబట్టి ఇక చెప్పేశానని నీతి పేర్కొన్నారు. Also Read: మరోవైపు తన పెళ్లి గురించి టైమ్స్ ఆఫ్ ఇండియాతో నీతి మాట్లాడుతూ.. ‘‘నిజానికి అక్టోబర్ ఆఖరిలో పెళ్లిచేసుకుందామని ముందు నిర్ణయించుకున్నాం. కానీ, కొవిడ్-19 పరిస్థితి చక్కబడేటట్టు కనిపించలేదు. ఈ వైరస్ ఇప్పట్లో వదిలిపెట్టదని అర్థంచేసుకుని ముందుగానే పెళ్లిచేసుకోవాలని డిసైడ్ అయ్యాం. నిశ్చితార్థం రోజునే దండలు మార్చుకున్నాం. మా పెళ్లిలో మా సోదరీమణులు కూడా పాల్గొనలేదు. అందుకే, ఈ పరిస్థితి చక్కబడితే అందరితో కలిసి మా పెళ్లిని సెలబ్రేట్ చేసుకుంటాం’’ అని నీతి చెప్పుకొచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jEidRj
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...