Monday, 26 October 2020

వెంకటేష్ నుంచి శర్వానంద్ దగ్గరకి.. ‘ఆడాళ్ళూ మీకు జోహార్లు’ షురూ

‘సెకండ్ హ్యాండ్’ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమై ‘నేను శైలజ’ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు తిరుమల కిశోర్. ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘చిత్రలహరి’ సినిమాలతో తానేంటో నిరూపించుకున్నారు. తాజాగా ఎనర్జిటిక్ స్టార్ రామ్‌తో ‘రెడ్’ సినిమా పూర్తిచేశారు. ఇప్పుడు శర్వానంద్‌తో కొత్త సినిమాను ప్రారంభించారు. ఈ సినిమాకు ‘ఆడాళ్ళూ మీకు జోహార్లు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. హీరోయిన్. ఈ సినిమాను తిరుపతిలో ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పాల్గొని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. హీరో హీరోయిన్లు , రష్మిక మందనపై చిత్రీకరించిన ముహూర్తం షాట్‌కు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి క్లాప్ కొట్టారు. అనగాని సత్యప్రసాద్, 14 రీల్స్ అధినేతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందజేశారు. ఈ చిత్రాన్ని ఎస్.ఎల్.వి.సి బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సుజిత్ సారంగ్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే, నిజానికి ‘ఆడాళ్ళూ మీకు జోహార్లు’ సినిమాను తిరుమల కిశోర్ వెంకటేష్‌తో చేయాలని మొదట భావించారు. ‘నేను శైలజ’ సినిమా తరవాత ఈ కథను వెంకటేష్‌కు తిరుమల కిశోర్ చెప్పారు. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడం దాదాపు ఖాయమే అన్నారు. ఏమైందో తెలీదు కానీ ఈ సినిమా పట్టాలెక్కలేదు. సుమారు నాలుగు సంవత్సరాలు తరవాత అదే ప్రాజెక్ట్‌ను శర్వానంద్ హీరోగా ఇప్పుడు సెట్స్‌పైకి తీసుకెళ్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3owzjDM
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...