Friday, 23 October 2020

ఇద్దరు కృష్ణుల క్రేజీ కాంబో.. అర్ధాంతరంగా ఆగిపోయిన ఎనిమిదో సినిమా

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల కాంబినేషన్‌తో పాటు కొన్ని హీరో-డైరెక్టర్‌ కాంబినేషన్లు కూడా ప్రేక్షకులకు ఆసక్తిని కలిగిస్తాయి. ఈ కోవలోకే వస్తుంది , జోడీ. బాలకృష్ణ కెరీర్‌కి బూస్టప్ ఇచ్చిన ‘మంగమ్మ గారి మనవడు’ సినిమాకు కోడి రామకృష్ణ డైరెక్టర్. ఎన్టీఆర్ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య హీరోగా నిలదొక్కుకుంటున్న సమయంలో వచ్చిన మంగమ్మ గారి మనవడు.. ఆయనకు తిరుగులేని మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి వీరిద్దరు కలిస్తే సూపర్‌హిట్ ఖాయమన్న ముద్ర ఇండస్ట్రీలో పడిపోయింది. ఆ తర్వాత ఇద్దరి కలయికలో ముద్దుల కృష్ణయ్య, మువ్వ గోపాలుడు, భారతంలో బాలచంద్రుడు, ముద్దుల మామయ్య, బాలగోపాలుడు, ముద్దుల మేనల్లుడు సినిమాలు తెరకెక్కాయి. వీరిద్దరి కాంబినేషన్లో 90శాతం సినిమాలు సూపర్‌హిట్లుగా నిలిచాయి. భారతంలో బాలచంద్రుడు మాత్రం పరాజయం పాలైంది. అయితే వీరిద్దరు కలిసి ఎనిమిదో చిత్రంగా ‘విక్రమ సింహ భూపతి’ అనే సినిమానుతెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. బాలయ్యతో ‘మంగమ్మ గారి మనవడు’ సినిమా తెరకెక్కించిన భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్.గోపాలరెడ్డి నిర్మాత. అయితే షూటింగ్ సగం పూర్తయిన తర్వాత నిర్మాత చనిపోవడంతో సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది. గోపాలరెడ్డి కుమారుడు భార్గవ్‌ రెడ్డి ఈ సినిమాను పూర్తిచేసేందుకు శతవిధాలా ప్రయత్నించినా సఫలం కాలేదు. 2018లో ఆయన కూడా అకాల మరణం పొందారు. అయినప్పటికీ ఆ సినిమాను ఇతర నిర్మాతలెవరైనా ముందుకొచ్చి పూర్తి చేస్తారేమోనని అభిమానులు ఆశగా ఎదురుచూశారు. అయితే 2019లో కోడి రామకృష్ణ కూడా కన్నుమూయడంతో ఈ సూపర్ కాంబినేషన్‌కు తెరపడింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3omnEqL
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...