Monday, 5 October 2020

సంజూ భాయ్ ఇలా మారిపోయాడేంటి.. షాకవుతున్న ఫ్యాన్స్

బాలీవుడ్‌లో సంజయ్‌దత్‌కు ఉన్న క్రేజే వేరు. ఇటీవలే ఆయన లంగ్ క్యాన్సర్ బారిన పడినట్లు తెలియడంతో షాకైంది. శ్వాస సంబంధమైన సమస్యతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు డాక్టర్లు అన్నిరకాల టెస్టులు చేయగా క్యాన్సర్ అని తేలింది. సంజూకు లంగ్ క్యాన్సర్ అడ్వాన్డ్స్‌ స్టేజ్‌లో ఉందని, ప్రస్తుతానికి పరిస్థితి బాగానే ఉన్నా ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేదని డాక్టర్లు తెలిపారు. Also Read: క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్‌లో ఉన్న ఆయన ముంబయిలో తొలి దశ కీమోథెరపీ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం భార్య మాన్య, పిల్లలతో కలిసి దుబాయ్‌లో ఉంటున్నారు. అయితే తాజాగా సంజయ్‌దత్‌కు చెందిన ఓ ఫోటో అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. ఎయిర్‌పోర్టులో ఓ అభిమాని ఆయనతో తీసుకున్న ఫోటోను సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో సంజూ చాలా బలహీనంగా కనిపిస్తున్నారు. Also Read: దీంతో తమ అభిమాన నటుడు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలంటూ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. సంజూభాయ్ చివరగా సడక్-2 సినిమాలో నటించారు. ‘భుజ్: ద ప్రైడ్ ఆఫ్ ఇండియా’ మూవీ త్వరలోనే విడుదల కానుంది. దీనితో పాటు పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న కేజీఎఫ్ ఛాప్టర్ -2లో అధీర అనే రోల్‌లో కనిపించనున్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36vndnH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...