Thursday, 8 October 2020

Bigg Boss 4: బిగ్ బాస్‌కి దూరం కాబోతున్న నాగార్జున! ఆయన స్థానంలో స్టార్ హీరోయిన్.. అసలు కారణమిదే!!

మొదటి కాస్త తడబడినా ఆ తర్వాత రంజుగా సాగిపోతోంది బిగ్ బాస్ తెలుగు సీజన్ 4. రసవత్తరంగా సాగిపోతున్న ఈ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు స్పెషల్ కిక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో సరిగ్గా ఈ సమయంలో బిగ్ బాస్ హోస్ట్ మారుతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమనడం జనాల్లో హాట్ టాపిక్ అయింది. బిగ్ బాస్‌ హోస్ట్ స్థానంలో నాగార్జున బదులుగా వేరొక సెలబ్రిటీ కనిపించబోతున్నారని తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఇటీవలే తన కొత్త సినిమా 'వైల్డ్ డాగ్' షూటింగ్ నిమిత్తం థాయ్‌లాండ్ వెళ్లిన వెళ్లిన నాగార్జున ఇంకా తిరిగి రాలేదని తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఇంకా కొన్ని వారాలపాటు అక్కడే షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉందట. దీంతో నాగార్జునను డిస్టర్బ్ చేయకుండా కొన్ని ఎపిసోడ్స్‌లో ఆయన బదులుగా వేరొకరిని తీసుకోవాలని ప్లాన్ చేసిందట బిగ్ బాస్ యాజమాన్యం. ఇందుకోసం ముందుగా ఎన్టీఆర్, నానిలతో పాటు నాగచైతన్యను కూడా సంప్రదించగా.. వారంతా తమ తమ సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నామని చెప్పారట. దీంతో వద్దకు ఆ ఆఫర్ వెళ్లిందని టాక్. Also Read: గత సీజన్ లోనూ హోస్ట్ నాగార్జున అందుబాటులో లేని సమయంలో బిగ్ బాస్ హోస్ట్‌గా చేసి ప్రేక్షకాధరణ పొందింది రమ్యకృష్ణ. ఈ క్రమంలోనే బిగ్ బాస్ యాజమాన్యం తీసుకొచ్చిన ప్రపోజల్‌పై ఆమె కూడా సానుకూలంగా స్పందించి ఓకే చెప్పిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ వారం నుంచే బిగ్ బాస్ హౌస్ బాధ్యతలు రమ్యకృష్ణ చేతిలో పెట్టారని.. ఈ రోజు (శుక్రవారం) సాయంత్రం ఆమె బిగ్ బాస్ హౌస్‌లో అడుగు పెట్టనుందని తెలుస్తోంది. మరోవైపు ఓ ప్రత్యేక విమానంలో వచ్చి బిగ్ బాస్ షూట్ చేసుకొని వెళ్లాలని నాగార్జున భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ వారం ఎపిసోడ్ హోస్ట్ ఎవరనే దానిపై జనాల్లో ఓ రకమైన కుతూహలం నెలకొంది. చూడాలి మరి నాగార్జున ఎలాంటి షాకిస్తాడో!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nHs77k
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...