Monday, 19 October 2020

Anushka Sharma: సముద్రం మధ్యలో భర్తతో స్టార్ హీరోయిన్.. గర్భం దాల్చాక కూడా! విదేశాల్లో విరుష్క ఎంజాయ్

సెలబ్రిటీ కపుల్స్‌ విరాట్ కోహ్లీ- విదేశాల్లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏ మాత్రం సమయం దొరికినా ప్రత్యేక ప్రదేశాల్లో షికార్లు కొడుతూ తెగ హంగామా చేసే ఈ జంట సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తమ తమ లేటెస్ట్ ట్రిప్స్ తాలూకు ఫోటోలు షేర్ చేస్తూ సినీ, క్రీడాభిమానులను హుషారెత్తిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా విరాట్ తన సతీమణి అనుష్కతో దిగిన ఓ ఆకర్షనీయమై ఫోటో పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్ అయింది. ఓ వైపు ఐపీఎల్‌తో బిజీగా ఉంటూనే మరోవైపు తన ఇష్టసఖి, లైఫ్ పార్ట్‌నర్‌ అనుష్కతో షికార్లు కొడుతున్నారు విరాట్. అనుష్కతో హాలిడేస్‌ని ఎంజాయ్ చేయడమంటే తెగ ఇష్టపడే కోహ్లీ.. ఈ సారి విదేశాల్లోని సముద్రంలో సరదాగా సేదతీరారు. ఈ ఆనంద క్షణాలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఓ బ్యూటిఫుల్ పిక్ షేర్ చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) జట్టు సభ్యుడు ఎబి డివిలియర్స్ ఈ పిక్ తీశారని పేర్కొన్నారు. Also Read: సాయంకాలం సముద్రం మధ్యలో విరాట్- అనుష్క షాడో లుక్‌తో కూడిన ఈ పిక్ నెటిజన్లను ఫిదా చేస్తోంది. ఇది చూసిన నెటిజన్స్.. ''గర్భం దాల్చాక కూడా అనుష్క యమ యాక్టివ్‌గా ఉందే!, సూపర్ జోడీ, వావ్'' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఇటీవలే అనుష్క ప్రెగ్నెన్సీ విషయాన్ని కన్ఫర్మ్ చేసిన విరాట్.. 2021 జనవరి నెలలో మేమిద్దరం ముగ్గురం కాబోతున్నాం అని తెలిపారు. మరోవైపు చాలాకాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్న అనుష్క శర్మ.. గతేడాది చేసిన 'జీరో' మూవీ తర్వాత మరే సినిమాలో కనిపించలేదు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఇండియన్ ఉమెన్ క్రికెటర్ ఝులన్ గోస్వామి బయోపిక్‌గా రానున్న 'చక్దాహా ఎక్స్‌ప్రెస్' సినిమాలో నటించేందుకు రెడీ అయింది. కానీ ఈ మూవీ షూటింగ్ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dCS6rX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...