Saturday, 10 October 2020

బోయపాటి శ్రీను వదిలిన కేస్‌ 99.. మనసులో మాట చెప్పిన మాస్ డైరెక్టర్

మానవ సంబంధాలే ముఖ్య ఆయుధాలుగా తెరకెక్కిన చిత్రం ‘’. ప్రియదర్శిని రామ్‌ నటించి దర్శకత్వం వహించిన చిత్రం ఇది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ రిలీజ్ చేశారు మాస్‌ కమర్షియల్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు తెలుపుతూ తన మనసులో మాట చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. ''ప్రియదర్శిని రామ్‌ ఏ పనిచేసినా ప్రాణం పెట్టి చేస్తాడు. ఈ సినిమాలో పాలుని, నీటిని వేరుచేసే హంస లాంటి పాత్రతో సమాజంలో జరిగే చెడును బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన దౌర్జన్యానికి మానవ సంబంధాలే కారణమని అందరూ ఆలోచిన్తున్న సమయంలో వస్తున్న చిత్రమిది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా'' అన్నారు. Also Read: దర్శకుడు రామ్‌ మాట్లాడుతూ.. ''గ్రేట్‌ టెక్నీషియన్‌, అంతకంటే మంచి మనసున్న వ్యక్తి బోయపాటి శ్రీను. మట్టిని నమ్ముకుని సాధారణ జీవితం నుండి పైకొచ్చిన వ్యక్తి ఆయన. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌లాంటి ఓటీటీలో ఎక్కడ చూసినా పదికి ఏడు సినిమాలు క్రైమ్ ‌థ్రిల్లర్‌లే ఉంటున్నాయి. క్రైమ్‌ సినిమాలే ఎందుకుంటున్నాయంటే సమాజంలో జరుగుతున్నాయి కాబట్టే ఉంటున్నాయి. వాటన్నింటిని నేను పరిష్కరించలేను గానీ నా వంతుగా చక్కని సినిమా తీయాలి అనిపించింది. వారం పదిరోజుల్లో సినిమాకి సంబంధించిన ఫస్ట్‌కాపీ రెడీ అవుతుంది. సినిమా ప్రయాణాన్ని చాలా ఎంజాయ్‌ చేశాం. దానికి కారణం కొత్త రక్తంతో వస్తున్న యువనిర్మాతలు గౌతమ్, కీర్తీ, వివేక్‌లు తమ మెలోడ్రామా అనే కంపెనీ ద్వారా నాకు చక్కని అవకాశాన్ని ఇచ్చారు. వారందరికి మాట ఇస్తున్నాను. నేను చాలా మంచి సినిమా తీశానని'' అన్నారు. ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ‘కేస్‌ 99’లో ప్రియ‌ద‌ర్శిని రామ్‌, తిరువీర్‌, అనువ‌ర్ణ‌, నిహాల్ కోదాటి, అజ‌య్ ఖ‌తుర్వార్‌, అప‌రాజిత‌, ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్‌, క్రియేష్ రాజ్‌, అశోక్ రావు, విజ‌య్ గోప‌రాజు, మ‌నోజ్ ముత్యం, నితిన్‌, ప్ర‌స‌న్‌, రోష‌న్ తదితరులు నటిస్తున్నారు. ఆషిక్‌ అరుణ్ సంగీతం అందిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2GMwPQi
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...