Saturday, 5 September 2020

Sri Reddy: కంగనాపై శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్స్.. సెక్సీ బాంబ్ ఎంటర్ కావడంతో రచ్చ రచ్చ.. బుక్కయిందిలా!!

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత ఫైరింగ్ బ్యూటీ ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో నెపోటిజం మొదలుకొని డ్రగ్స్ ఇష్యూ వరకూ అన్నింటిపై ఆమె షాకింగ్ కామెంట్స్ చేస్తూ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తోంది. ముంబై నగరం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ని తపిస్తోందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అయితే తాజాగా ఈ ఇష్యూలో వేలుపెట్టి తనదైన స్టైల్ కామెంట్ చేసింది . దీంతో శ్రీ రెడ్డి- కంగనా వ్యవహారం సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా మారింది. ముంబై పోలీసులపై కంగన చేసిన విమర్శలను తప్పుపడుతూ శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఓ పత్రికలో సంపాదకీయం రాయడం, ముంబై పోలీసులపై నమ్మకం లేకుంటే ముంబైలో అడుగుపెట్టకు. ఒకవేళ పెడితే రాళ్లతో కొడతాం అంటూ బహిరంగ ప్రకటన చేయడంతో ఈ ఇష్యూ చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ బెదిరింపులకు తాను బయపడటంలేదని పేర్కొంటూ ముంబై నగరం ఏమైనా పాక్ ఆక్రమిత కాశ్మీరా.. వస్తున్నా.. దైర్యం ఉంటే ఆపండి అని సవాల్ విసిరింది కంగనా. Also Read: ఇక సరిగ్గా ఈ పరిస్థితుల్లో టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీ రెడ్డి ఈ ఇష్యూలోకి ఎంటరై కంగనా తీరుపై విరుచుకుపడుతూ పోస్ట్ పెట్టింది. కంగనాకు తల పొగరు ఎక్కువగా ఉందని, ఆమె వరెస్ట్ అంటూ రెచ్చిపోయి కామెంట్స్ చేసింది. మహారాష్ట్రలోనే క్రేజ్ కొట్టేయడంతో పాటు కోట్లు, అభిమానుల ప్రేమను సంపాదించుకున్న కంగనా ఇప్పుడిలా మాట్లాడటం సరికాదన్నట్లు శ్రీ రెడ్డి తన కామెంట్ వదిలింది. అంతేకాదు ఐ లవ్ ముంబై అంటూ కంగనా అభిమానులకు ఎక్కడో కాలేలా చేసింది శ్రీ రెడ్డి. దీంతో వ్యవహారం అటుతిరిగి ఇటుతిరిగి శ్రీ రెడ్డి వద్దకు చేరింది. కంగనాకు కామెంట్స్ చేసేంత పెద్ద దానివయ్యావా? అంటూ శ్రీ రెడ్డిపై విరుచుకుపడుతున్నారు నెటిజన్లు. బాలీవుడ్ ఇష్యూస్‌లో కూడా వేలు పెట్టడం నీకు అవసరమా? అంటూ ఆమెను ఏకిపారేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/322CRnR
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...