Sunday, 6 September 2020

Ntr: ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబోపై కీలక అప్‌డేట్.. హీరోయిన్ ఫిక్స్! మాటల మాంత్రికుడి ప్లాన్ ఇదే..

ఇటీవలే 'అల.. వైకుంఠపురములో' సినిమాతో భారీ హిట్ ఖాతాలో వేసుకున్న మాటల మాంత్రికుడు శ్రీనివాస్ తన తదుపరి సినిమా కోసం భారీ కసరత్తులు చేస్తున్నారట. యంగ్ టైగర్ హీరోగా ఈ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్ కారణంగా విరామ సమయం దొరకడంతో స్క్రిప్ట్‌ని మెరుగులు దిద్దుతూ నటీనటుల ఎంపికపై ఫోకస్ పెట్టారట. ఈ క్రమంలో ఎన్టీఆర్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ, శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ని ఫైనల్ చేసేశారని తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాలో ఎన్టీఆర్ జోడీగా జాన్వీ నటించనుందని, అందుకోసం ఆమెకు భారీ రెమ్మ్యూనరేషన్ కూడా ఆఫర్ చేశారనే వార్తలు ఎప్పటినుంచో వస్తున్నాయి. మరోవైపు శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీపై పలు రూమర్స్ షికారు చేస్తున్న నేపథ్యంలో త్రివిక్రమ్ ఫైనల్ నిర్ణయం తీసుకున్నారనేది లేటెస్ట్ టాక్. ఈ మూవీలో కొత్త హీరోయిన్ అయితే బెటర్ అని భావించిన త్రివిక్రమ్.. జాన్వీ బెస్ట్ ఛాయిస్ అని ఫిక్సయ్యారట. అంతేకాదు తన సినిమాతో ఆరంగేట్రం చేయించడం కోసం ఆమె క్యారెక్టర్‌లో తగు మార్పులు చేర్పులు చేసే పనిలో ఉన్నారట త్రివిక్రమ్. Also Read: హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఎస్.రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా కథ ఒక పురాతన పాడుబడిన కోట చుట్టూ తిరుగుతుందని, ఆ కథకు త్రివిక్రమ్ స్టైల్ మేకింగ్ అబ్బురపరుస్తుందని ఫిలిం నగర్ టాక్. ఇక ఈ మూవీలో మరో హీరోయిన్‌కి కూడా స్కోప్ ఉందని తెలుస్తోంది. అయితే అది మాస్ క్యారెక్టర్ కావడంతో ఆ ఛాన్స్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్‌కి ఇచ్చారని అంటున్నారు. అతిత్వరలో హీరోయిన్స్ విషయమై అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇవ్వనున్నారట మేకర్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3i3GwaL
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...