మౌనరాగం సీరియల్ నటి బలవన్మరణం వెనుక కీలక ఆధారాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేయడంతో ఇటు దేవరాజ్, అటు సాయి కృష్ణ అదేవిధంగా Rx 100 నిర్మాత అశోక్ రెడ్డికి సంబంధించిన విషయాలతో పాటు వారి వారి ఫోన్ సంభాషణలు రివీల్ అవుతూ పలు అనుమానాలకు తెరలేపుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా శ్రావణి తల్లి పాపా రత్నం స్పందిస్తూ రెడ్డి కారణంగానే తన కూతురు సూసైడ్ చేసుకుందని పేర్కొంటూ కీలక విషయాలు బయటపెట్టింది. టిక్ టాక్ ద్వారా పరిచయమైన దేవరాజ్ రెడ్డి అనే వ్యక్తి కారణంగానే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని మొదటి నుంచి ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రావణి తల్లి చెప్పిన కొన్ని విషయాలు ఆ ఆరోపణలకు బలం చేకూర్చాయి. ఆత్మహత్య చేసుకునే ముందే తన కూతురు బాత్రూమ్‌లో నుంచి దేవరాజుకు చివరగా ఓ ఫోన్ కాల్ చేసిందని, అతను పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వకపోవడంతో మనస్థాపం చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడిందని ఆమె చెప్పింది. Also Read: దేవరాజు మోసగాడని, అతని నుంచి దూరంగా ఉండాలనే శ్రావణిని సాయి కొట్టాడని, సాయి కృష్ణ చాలా మంచివాడని శ్రావణి తల్లి చెప్పుకొచ్చింది. దేవరాజు తన కూతురితో ప్రేమ నాటకం ఆడాడని, అంతేగాక తన కూతురు వద్ద డబ్బులు గుంజి మానసికంగా హింసించాడని చెప్పింది. తమ కూతురును లేకుండా చేసిన దేవరాజును కఠినంగా శిక్షించాలని ఆమె కోరింది. మరోవైపు సాయి కృష్ణ సైతం ఇదే ఆరోపణ చేస్తున్నాడు. దీంతో దేవరాజును, సాయి కృష్ణను ఒకేసారి విచారణ చేయాలని చూస్తున్నారు పోలీసులు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mrYhTI
v
No comments:
Post a Comment