Saturday, 19 September 2020

Sarkaru Vaari Paata: కీర్తి సురేష్‌కి షాకిచ్చిన మహేష్ బాబు! ముంబై భామతో రొమాన్స్‌కి రెడీ

ఈ ఏడాది ఆరంభంలోనే 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న .. మరికొద్ది రోజుల్లో తన లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట' సెట్స్ మీదకు రాబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టైటిల్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తి రేకెత్తించడంతో ఈ మూవీ అప్‌డేట్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తోంది ప్రేక్షకలోకం. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ షాకింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని ప్రకారం ఈ సినిమా నుంచి కీర్తి సురేష్‌ని తప్పించినట్లు తెలుస్తోంది. మహేష్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా రూపొందనున్న 'సర్కారు వారి పాట'లో ఆయన సరసన కీర్తి సురేష్‌ని హీరోయిన్‌గా కన్ఫర్మ్ చేసినట్లు ఇప్పటిదాకా వార్తలు వచ్చాయి. కానీ లేటెస్ట్ సమాచారం మేరకు చిత్రయూనిట్ ఆమెపై వేటు వేసిందని తెలుస్తోంది. చివరి నిమిషంలో ఈ ఆఫర్‌ని మరో స్టార్ హీరోయిన్‌కి ఇచ్చారని తెలుస్తోంది. ఆమె స్థానంలో ఓ బాలీవుడ్ బ్యూటీని ఫైనల్ చేశారని టాక్ నడుస్తోంది. అయితే ఉన్నట్టుండి కీర్తిని ఎందుకు పక్కనబెట్టారనేది మాత్రం తెలియరాలేదు. Also Read: సోషల్ మెసేజ్‌తో కూడిన స్ట్రాంగ్ కథాంశంతో పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. మహేష్ కెరీర్‌లో 27వ సినిమాగా రానున్న ఈ సినిమా రెగ్యులర్ షూట్ అతిత్వరలో ప్రారంభం కానుంది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ కూడా నటిస్తుందని తెలుస్తుండటం విశేషం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RIoVcS
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...