Saturday, 19 September 2020

‘మహా సమద్రం’ నుంచి తప్పుకున్న సమంత.. ఆ హీరోనే కారణమా?

‘ఆర్‌ఎస్ 100’ వంటి సూపర్‌హిట్ సినిమా అందించిన దర్శకుడు అజయ్ భూపతి కాస్త గ్యాప్ తీసుకుని తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ‘మహాసముద్రం’. ఈ సినిమాలో శర్వానంద్‌, హీరోలుగా నటిస్తున్నారు. హీరోయిన్‌గా సమంతను ఓకే చేయగా తాజాగా ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో ఆమె స్థానంలో ఐశ్వర్య రాజేష్‌ను తీసుకోనున్నట్లు సమాచారం. అయితే ఉన్నపళంగా సమంత ఈ సినిమా నుంచి ఎందుకు తప్పుకుందన్న చర్చ సినీవర్గాల్లో మొదలైంది. అసలు కారణం బయటకు తెలియకపోయినా.. సిద్దూ వల్లే సామ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు గాసిప్స్ వస్తున్నాయి. గతంలో సిద్ధార్థ, సమంత ప్రేమలో ఉన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. చాలాచోట్ల వారిద్దరు జంటగా కనిపించడం, శ్రీకాళహస్తి ఆలయంలో కలిసి రాహుకేతు పూజ చేయడంతో పెళ్లి చేసుకుంటారన్న ప్రచారం జరిగింది. వీళ్లిద్దరు కలిసి ‘జబర్దస్త్’ అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు కానీ వీరిద్దరు బద్ధ శత్రువుల్లా మారిపోయారు. ఆ తర్వాత వారసుడు నాగచైతన్యతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుని సెటిలైంది. ఇటీవల ఓ ఇంట్వర్యూలో సిద్ధూ పేరు ప్రస్తావించకుండానే సమంత అతడిపై పరోక్షంగా విమర్శలు చేసింది. సావిత్రి గారి జీవితంలో ఎలాంటి కష్టాలు సంభవించాయో నా జీవితం కూడా అలాగే అయ్యేది. కానీ నేను ముందే పసిగట్టడంతో బ్రతికుపోయా. అందువల్లే ఇప్పుడు నా జీవితం సాఫీగా సాగిపోతోంది. నేను జీవితంలో తీసుకున్న పెద్ద నిర్ణయాల్లో ఇది ఒకటి. చైతూ నాకు దేవుడిచ్చిన కానుక’ అంటూ సమంత చెప్పుకొచ్చింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZN1Ee4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...