పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నిత్యం సమాజ విషయాలు, మహిళా సమస్యలపై స్పందిస్తున్నారు టాలీవుడ్ టాప్ స్టార్స్ కోడళ్ళు ఉపాసన, సమంత. సినిమాల్లో నటిస్తూనే సత్తా చాటుతుండగా, అపోలో హాస్పిటల్ బాధ్యతలు మోస్తూనే టెక్నాలజీ అందిపుచ్చుకుంటూ ఆరోగ్య చిట్కాలు అందిస్తోంది ఉపాసన. ఈ నేపథ్యంతో తాజాగా ప్రయత్నానికి సమంత తోడైంది. ఉపాసన ప్రారంభించిన .co.in అనే వెబ్‌సైట్‌కు అతిథి సంపాదకురాలిగా సమంత వ్యవహరించబోతోంది. అర్హులైన నిపుణుల నుండి నిర్దిష్టమైన సమాచారాన్నిఅందిస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలి అంశాలను ఎంచుకునే అవకాశాన్ని కల్పించడం, ప్రజలు తమ జీవితాలను పరిపూర్ణంగా ఆరోగ్యకరంగా సాగించేలా స్ఫూర్తిని అందించడం లక్ష్యంగా URLife.co.in అనే వెబ్‌సైట్‌ను ఉపాసన ప్రారంభించింది. నిపుణులైన వైద్య బృందం నుంచి ఆరోగ్య సూత్రాలు, పోషకాల గురించిన వీడియోలు, ఆహార నియమాల ప్రణాళికలు, జీవనశైలి సలహాలను ఈ వెబ్‌సైట్ ద్వారా అందించబోతున్నారు. Also Read: అయితే తాజాగా ఈ URLife.co.in వెబ్‌సైట్ అతిథి సంపాదకురాలిగా స్వయంకృషితో ఎదిగిన స్టార్ హీరోయిన్ సమంత అక్కినేనిని ప్రకటించింది యుఆర్ లైఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఉపాసన. ప్రకృతి అనుకూలమైన జీవనం, సంపూర్ణ ఆరోగ్యం, మానసిక, భావోద్వేగాల సమతుల్యత లాంటి తాను గాఢంగా నమ్మే కొన్ని సిద్ధాంతాలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా URLife.co.in వెబ్ సైట్ ఏర్పాటు చేశామని తెలిపింది ఉపాసన. తమ విలువలను గౌరవించే వారిలో సమంత కూడా ఒకరని ఆమె పేర్కొంది. ''సమంత కూడా సేంద్రీయ వ్యవసాయం ద్వారా పర్యావరణ రక్షణని ప్రోత్సహిస్తున్నారు. పూర్తి శాకాహారపు జీవనాన్ని అనుసరిస్తూ ఫిట్‌నెస్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. సో.. URLife.co.in వెబ్ సైట్ ద్వారా ఆమె నైపుణ్యం మరింత మందికి చేరువ అవుతుందని ఆకాంక్షిస్తున్నాం'' అని తెలిపింది ఉపాసన. 'జస్ట్ అలా కూర్చుని ఉంటే పర్ఫెక్ట్ కాలేం. లేవండి.. కదలండి.. ఫిట్ అవ్వండి' అని ఈ సందర్భంగా సమంత పేర్కొనడం విశేషం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2FUl9dE
v
No comments:
Post a Comment