నా పాటతో పయనం ముగిసింది.. నా గొంతు మూగబోయింది. నా పాట మీ నోట కలకాలమైనా.. సంగీత ప్రపంచానికి ఇక సెలవు అంటూ ఈ లోకం విడిచారు గాన గాంధర్వుడు . మనసుని తాకే పాటల్ని మనకిచ్చి ఆ మహా మనిషి మాయమయ్యారు. స్వర మాంత్రికుడు, తన గానంతో అమృతం పంచే మేటి గాయకుడు బాలు లేరన్న వార్త కోట్లాది మంది సంగీత ప్రియుల్ని కలచివేస్తుంది. RIP SPB అంటూ ప్రపంచ వ్యాప్తంగా ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. బాలు ఇక లేరు అంటూ వేదన చెందుతున్నారు. ఈ తరుణంలో ‘బాలు గారు ఇక లేరు అనడం తప్పు’ అంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ నివాళి తెలిపారు ప్రముఖ దర్శకుడు . ‘బాలు గారు ఇక లేరు అనటం తప్పు. పాట ఉన్నంత కాలం ఆయన మన మధ్యే ఉంటారు. కాని ఆయన ఇక పాట పాడరు అనే విషయమే జీర్ణించుకోలేని నిజం. గానగంధర్వుడికి శోకతప్త హృదయంతో అశృనివాళులు’ అంటూ ట్వీట్ చేశారు కొరటాల. ఈయనతో పాటు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్, త్రివిక్రమ్, రాఘవేంద్రరావు సినీ రాజకీయ ప్రముఖులు బాలు మరణంపై నివాళులు తెలిపారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/364VRo2
v
No comments:
Post a Comment