Wednesday, 9 September 2020

Rashmi Gautam: పోతురాజు లవర్ రష్మీ.. అమ్మడి జబర్దస్త్ లుక్.. వావ్! బొమ్మ బ్లాక్‌బస్టర్

పలు సూపర్ డూపర్ ప్రోగ్రామ్స్ చేస్తూ బుల్లితెరపై హవా కొనసాగిస్తున్న యాంకర్ అప్పుడప్పుడూ వెండితెర ప్రేక్షకులను కూడా అలా పలకరించి వెళ్తుంటుంది. బుల్లితెరపై వచ్చిన సక్సెస్ వెండితెరపై రాకపోయినా అదృష్టం పరీక్షించుకుంటూ విభిన్న పాత్రలు పోషిస్తూ వస్తోంది ఈ జబర్దస్త్ బ్యూటీ. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్ ఇస్తూ హంగామా చేస్తున్న రష్మీ.. తాజాగా తన లేటెస్ట్ మూవీ '' తన లుక్ షేర్ చేసింది. విజయీభవ ఆర్ట్స్ పతాకంపై ప్రవీణ్ పగడాల, బోస్ బాబు నిడిమోలు, ఆనంద్ రెడ్డి నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం 'బొమ్మ బ్లాక్‌బస్టర్'. ఈ చిత్రానికి రాజ్ విరాఠ్ దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్ న‌టులు నందు, రష్మీ గౌతమ్‌ జంటగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇందులో తన క్యారెక్టర్ పేరు చెబుతూ తన లుక్ పోస్ట్ చేసి అట్రాక్ట్ చేసింది రష్మీ గౌతమ్. Also Read: పోతురాజు గాడి ల‌వర్ వాణిగా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు పేర్కొన్న ర‌ష్మీ గౌత‌మ్.. త‌ల‌పై కిరీటం పెట్టుకుని చిరున‌వ్వులు చిందిస్తూ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్న తన పోస్టర్ షేర్ చేసింది. ఈ పోస్టర్ చూసిన నెటిజన్లు.. ''వావ్! రియల్లీ బొమ్మ బ్లాక్‌బస్టర్'' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నందు పోతురాజు పాత్ర పోషిస్తాడని, దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు ఫ్యాన్‌గా ఆయన నటన అట్రాక్ట్ చేస్తుందని అంటున్నారు యూనిట్ సభ్యులు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33eheAb
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...