Wednesday, 23 September 2020

Rashmi Gautam: పెళ్లికి రెడీ అయిన రష్మీ.. వరుడి వివరాలివే! సుడిగాలి సుధీర్‌‌కి జబర్దస్త్ పంచ్..

లాక్‌డౌన్ వేళ టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. నిఖిల్, నితిన్, రానా లాంటి యంగ్ హీరోలతో పాటు పలువురు టీవీ ఆర్టిస్టులు కూడా పెళ్లి పెట్టాలెక్కారు. తాజాగా ఇదే బాటలో వెళ్లేందుకు సిద్దమైందట జబర్దస్త్ బ్యూటీ . ఈ మేరకు కాబోయే వాడిని కూడా ఎంపిక చేసుకుందని, త్వరలోనే ఆమె శుభవార్త చెప్పబోతోందంటూ ఫిలింనగర్ కోడై కూస్తోంది. దీంతో సోషల్ మీడియా మొత్తం వార్తలతో హోరెత్తిపోతోంది. ఇటు బుల్లితెర, అటు వెండితెరపై హవా సాగిస్తున్న రష్మి గౌతమ్ మనసు పెళ్లిపై మళ్లిందట. ఎలాగూ 32 ఏళ్ళు వచ్చాయి. పైగా కెరీర్ సాఫీగా సాగిపోతోంది. పైగా తన పెళ్లి మ్యాటర్‌పై రోజుకో వార్త పుట్టుకొస్తోంది కాబట్టి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకుంటే బెటర్ అనే నిర్ణయానికి వచ్చిందట. తన తోటి యాంకర్స్ అంతా పెళ్లి తర్వాత కూడా సక్సెస్‌ఫుల్ కెరీర్‌‌ కొనసాగిస్తున్నారు అదే బాటలో తాను కూడా మ్యారేజ్ తర్వాత కెరీర్ కొనసాగించాలని డిసైడ్ అయిందట గౌతమ్. Also Read: ఇకపోతే రష్మీ ఇప్పటికే తనకు కాబోయే వరుడిని సెలక్ట్ చేసుకుందని తెలుస్తోంది. అతనో బిజినెస్ మ్యాన్ అని సమాచారం. అతనితో డీప్‌గా చర్చించి పెళ్లి తర్వాత ప్లాన్స్ గురించి రష్మీ వివరించినట్లు టాక్. రష్మీ అభిప్రాయంతో అతను ఏకీభవించడంతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ మేరకు ఇరు కుటుంబాల పెద్దలు ముహూర్తం ఫిక్స్ చేసే పనిలో పడ్డారని టాక్. అయితే ఈ విషయం తెలియగానే నెటిజన్ల చూపు సుడిగాలి సుధీర్‌పై పడింది. ఇది నిజంగా సుడిగాలి సుధీర్‌‌కి జబర్దస్త్ పంచ్ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. బుల్లితెరపై రష్మీ- సుధీర్ జోడీకి స్పెషల్ పాపులారిటీ ఉంది. కెమెరా ముందు ఈ ఇద్దరు పండించే రొమాన్స్ ఆడియన్స్‌కి యమ కిక్కివ్వడంతో రష్మీ- సుధీర్ డేటింగ్, పెళ్లి వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అయితే తామిద్దరం పెళ్లి చేసుకోవడం లేదని, తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని ఇటు రష్మీ, అటు సుధీర్ ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చినా ఆ వార్తలకు మాత్రం ఫుల్‌స్టాప్ పడలేదు. ఇక ఇప్పుడు రష్మీ పెళ్లి మ్యాటర్ బయటకురావడంతో మరోసారి అందరు చూపు సుడిగాలి సుధీర్‌‌పై పడటం విశేషం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RUHF8U
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...