Thursday, 24 September 2020

Nagma: ఎన్‌సీబీ తీరుపై నిప్పులు చెరిగిన నగ్మా.. హీరోయిన్ల పరువు తీస్తున్నారంటూ కంగనాపై షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత అనూహ్యంగా తెరపైకి వచ్చిన డ్రగ్స్ ఇష్యూ సినీ వర్గాలను వణికిస్తోంది. సుశాంత్ ప్రేయసి రియాకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని తెలియడంతో రంగంలోకి దిగిన (ఎన్‌సీబీ) లోతుగా విచారణ చేపడుతోంది. ఈ క్రమంలో రకుల్ ప్రీత్, దీపికా పదుకొనే సహా పలువురు స్టార్ హీరోయిన్ల పేర్లు బయటకొచ్చాయి. ఇప్పటికే దీపికా పదుకొనే, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్‌తో పాటు టాలీవుడ్ హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్‌కు నోటీసులు అందాయి. ఈ తరుణంలో డ్రగ్స్ ఇష్యూపై స్పందిస్తూ సంచలన కామెంట్స్ చేసింది సినీ నటి, కాంగ్రెస్ నేత . కేవలం వాట్సప్‌ మెసేజ్‌ల ఆధారంగా హీరోయిన్లకు సమన్లు జారీ చేసిన ఎన్‌సీబీ అధికారులు.. డ్రగ్స్ తీసుకున్నా అని బహిరంగంగా అంగీకరించిన కంగనా రనౌత్‌ను మాత్రం ఎందుకు వదిలేశారంటూ నిప్పులు చెరిగింది నగ్మా. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసిన ఆమె.. హీరోయిన్ల పరువు తీసేలా సమాచారాన్ని మీడియాకు అందచేయడం ఎన్‌సీబీ అధికారుల ఉద్యోగమా? ఇది నిజంగా విచారకరమైన విషయం అంటూ ఎన్‌సీబీ తీరుపై ఫైర్ అయింది. దీంతో నగ్మా చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. Also Read: కాగా హీరోయిన్ కంగనా రనౌత్ తాను కూడా డ్రగ్స్ కి బానిస అయినట్లు స్వయంగా చెప్పిన ఓ పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కంగనా మాట్లాడుతూ.. "నటిని కావాలన్న ఆశతో ఇంటినుంచి పారిపోయి ముంబైకి వచ్చాను. కొన్ని సంవత్సరాల తర్వాత హీరోయిన్ అయ్యాను. అప్పుడే డ్రగ్స్‌కి బానిసయ్యాను. నేను యుక్త వయసులో ఉన్నప్పుడు ఇది జరిగింది. నేను చాలా మంది వ్యక్తులతో ఇబ్బంది పడ్డాను" అని కంగనా చెప్పింది. ఇదే అంశాన్ని వేలెత్తిచూపుతూ ఎన్‌సీబీ తీరుపై నగ్మా ఫైర్ అయింది. కంగనా డ్రగ్స్‌కి బానిసయ్యానని స్వయంగా చెప్పినప్పటికీ ఆమెకు సమన్లు ఇవ్వలేదని.. దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌, దీపికా పదుకొణె, దియా మీర్జా వీళ్లంతా కూడా గతంలో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టే వాళ్లను ఈ విధంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొంటూ కొన్ని ఫొటోలు షేర్‌ చేసింది నగ్మా.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hZKoZe
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...