Friday, 18 September 2020

సమంత ప్లేస్‌లో ఐశ్వర్య?... ఆ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ

`ఆర్ఎక్స్ 100` లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మహాసముద్రం’. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్ నటిస్తున్నారు. తెలుగులో యూత్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న సిద్ధార్థ్ కొంతకాలంగా పూర్తిగా కనుమరుగైపోయాడు. చాలాకాలం తర్వాత క్రేజీ కాంబోతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు కూడా ఇంపార్ట్‌టెంట్ ఉండటంతో తీసుకున్నారు. Also Read: ఈ రోల్‌కు ముందుగా ఓకే చెప్పిన సామ్ అనివార్య కారణాలతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో ఆమె స్థానంలో కీర్తి సురేష్, సాయిపల్లవిలో ఎవరో ఒకరిని తీసుకోవాలని యూనిట్ భావించింది. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇప్పుడు ఆ ఛాన్స్ లక్కీగర్ల్ ఐశ్వర్య రాజేష్‌కు దక్కినట్లు తెలుస్తోంది. దీనిపై యూనిట్ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3iJQb6q
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...