Wednesday, 23 September 2020

టాలీవుడ్‌లో విషాదం... కరోనాతో ప్రముఖ హాస్య నటుడి మృతి

మరో తెలుగు నటుడిని బలి తీసుకుంది. ప్రముఖ సినీ, టీవీ నటుడు కోసూరి వేణుగోపాల్‌ కరోనా బారిన పడి చికిత్స పొందుతూ మరణించారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 22 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. దీంతో బుధవారం కన్నుమూశారు. Also Read: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన వేణుగోపాల్‌ ఎఫ్‌సీఐలో మేనేజర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఉద్యోగం చేస్తూనే సినిమాల్లో నటించేవారు. మర్యాద రామన్న, విక్రమార్కుడు, ఛలో, పిల్ల జమిందారు వంటి అనేక సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. వేణుగోపాల్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టాలీవుడ్ మంచి నటుడిని కోల్పోయిందంటూ అనేక మంది తమ సంతాపం ప్రకటించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3013iJl
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...