బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌పై నటి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలతో దేశవ్యాప్తంగా మరోసారి క్యాస్టింగ్ కౌచ్‌పై చర్చ జరుగుతోంది. పాయల్ వ్యాఖ్యలపై బాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది. కొందరు ఆమె వ్యాఖ్యలకు మద్దతుగా తెలుపుతుంటే.. మరికొందరేమో అనురాగ్‌కు అండగా నిలుస్తున్నారు. ఈ వ్యవహారం దక్షిణాది సినీ పరిశ్రమను కుదిపేస్తోంది. పాయల్ చేసిన ఆరోపణల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అంటోంది సౌత్ సీనియర్ హీరోయిన్ . Also Read: ‘నిప్పురవ్వ’ ‘అన్నమయ్య’ ‘డాన్ శీను’ వంటి తెలుగు చిత్రాల్లో నటించిన కస్తూరి ప్రస్తుతం ‘గృహలక్ష్మి’ సీరియల్‌లో నటిస్తోంది. తాజాగా పాయల్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. అనురాగ్‌పై నువ్వు చేసిన ఆరోపణలు కోర్టులో నిలబడవు. నేరాన్ని స్పష్టంగా ధృవీకరించే ఆధారాలు లేకుండా లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం వల్ల నీకు ఏ న్యాయం జరగదు. దీనివల్ల మీ ఇద్దరిలో ఎవరో ఒకరి కెరీర్ నాశనమవుతుంది’ అంటూ చెప్పుకొచ్చింది. కస్తూరి వ్యాఖ్యలపై స్పందించిన ఓ నెటిజన్.. ఇలా పరిస్థితే మీకో, మీ కుటుంబంలో ఎవరికైనా వస్తే ఇలాగే మాట్లాడతారా? అని ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన కస్తూరి.. నా కుటుంబంలో ఏంటి.. నేనే అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా. ఇండస్ట్రీలో నన్నూ వేధించారు. నేను కూడా దానికి బాధితురాలినే’ అంటూ అసలు విషయం చెప్పింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2G5NZHT
v
No comments:
Post a Comment