Tuesday, 29 September 2020

ఆ బ్యూటీతో నేచురల్ స్టార్‌తో మరోసారి రొమాన్స్?

ఇటీవలే ‘వి’ సినిమాతో ఓటీటీ ప్రేక్షకులను అలరించిన జోరు పెంచారు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ మూవీలో నటిస్తోన్న నాని.. ఆ తర్వాత టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్‌లో ‘శ్యామ్ సింగరాయ్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాది చివర్లో గానీ, వచ్చే ఏడాది ప్రారంభంలో గానీ స్టార్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాలో నటీనటులను ఎంపిక చేసే పనిలో పడ్డారు దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్. ఇందులో నెగిటివ్ ఛాయలున్న ఓ హీరోయిన్‌ పాత్రకు సాయిపల్లవిని ఫిక్స్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. మరో హీరోయిన్‌గా కన్నడ బ్యూటీ రష్మిక మందానాను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు ఆమె ఒప్పుకుంటే నానితో రెండోసారి రొమాన్స్ చేయనుంది. Also Read: గతంలో ‘దేవదాస్’ సినిమాలో నాని సరసన రష్మిక నటించింది. ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. మరోవైపు ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాకు సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్‌ను తీసుకోనున్నట్లు డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఈ సినిమా అంచనాలు భారీగా పెరగడం ఖాయం. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cF2DSO
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...