కేంద్ర ప్రభుత్వం కోవిడ్ నిబంధనలు సడలించడంతో దేశవ్యాప్తంగా షూటింగులు మొదలయ్యాయి. టాలీవుడ్‌లోనూ చాలా సినిమాల షూటింగులు మొదలుపెట్టేశారు. దీంతో కొద్దినెలలుగా ఖాళీగా ఉన్న తారలు ఇప్పుడిప్పుడే బిజీగా మారుతున్నారు. షూటింగులు మొదలుపెట్టే ముందుకు అందరికీ కరోనా టెస్టులు చేయడంతో పాటు భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. Also Read: ఈ క్రమంలోనే ఓ షూటింగ్‌లో పాల్గొన్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు కరోనా పరీక్షలు చేశారు. ముక్కులో నుంచి శాంపిల్ తీసుకునే క్రమంలో ఆమె చిన్నపిల్లలా ఏడుపు మొహం పెట్టింది. దీనికి సంబంధించిన వీడియోను పాయల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. Also Read: ”అన్ని జాగ్రత్తలతో మొత్తానికి తిరిగి సెట్స్ మీదకు వచ్చా. కరోనా శాంపిల్స్ తీసుకునే సమయంలో చాలా భయమేసింది. ముక్కులో తిప్పుతూ శాంపిల్స్ తీసుకోవడం భయంగా, ఇబ్బందిగా అనిపించింది. మొత్తానికి ఇచ్చేశా. పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది” అంటూ పాయల్ వెల్లడించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33YGDOQ
v
No comments:
Post a Comment