Saturday, 26 September 2020

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో షాకింగ్ ట్విస్ట్‌: రకుల్‌ అరెస్ట్ తప్పదా?

సౌత్‌తో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న రకుల్‌ప్రీత్ సింగ్‌కు బాలీవుడ్ డ్రగ్స్ కేసులో చిక్కులు తప్పేలా లేదు. ఈ కేసులో విచారణలో భాగంగా శుక్రవారం ఆమె నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరీ(ఎన్సీబీ) అధికారుల ఎదుట హాజరైంది. ఈ సందర్భంగా రియా చక్రవర్తితో స్నేహం సహా అనేక అంశాలపై రకుల్ కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. అయితే తానెప్పుడూ డ్రగ్స్‌ తీసుకోలేదని, డ్రగ్ చాట్ మాత్రమే చేశారని ఆమె అంగీకరించినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ విషయమై రియాతో చాలాసార్లు మాట్లాడానని, కొన్నిసార్లు తన ఫ్లాట్‌లో డ్రగ్స్ దాచినట్లు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. రకుల్ విచారణపై వస్తున్న వార్తలు నిజమైతే గనుక ఆమె అరెస్ట్ కావడం ఖాయమని ప్రముఖ న్యాయవాది చెబుతున్నారు. ఎన్డీపీఎస్ చట్టం 8(సి) ప్రకారం డ్రగ్స్ దాచడం కూడా పెద్ద నేరమని, రకుల్ నిజంగా డ్రగ్స్ దాచినట్లు తేలితే చిక్కులు తప్పవని పేర్కొన్నారు. రకుల్ ముంబయి వెళ్లినప్పుడల్లా రియా చక్రవర్తితో పార్టీలు, పబ్బులకు తిరిగేదని తెలుస్తోంది. ఆమెతో చేసిన స్నేహమే ఇప్పుడు రకుల్‌ను చిక్కుల్లో పడేస్తోందని బాలీవుడ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. Also Read: మరోవైపు క్షితిజ్ రవి ప్రసాద్ అనే వ్యక్తి తన స్నేహితులకు డ్రగ్స్ సరఫరా చేశాడని రకుల్ వెల్లడించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. క్షితిజ్ నుంచి డ్రగ్స్ తీసుకున్న నలుగురు సెలబ్రిటీల పేర్లను కూడా రకుల్ బయటపెట్టిందని తెలుస్తుండటంతో సినీ వర్గాలు వణికిపోతున్నాయి. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్‌కు క్షితిజ్ అత్యంత సన్నిహిత వ్యక్తి అని తెలుస్తున్న నేపథ్యంలో కరణ్‌ను కూడా ఎన్‌సీబీ అధికారులు విచారణకు పిలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3i4Rlby
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...