తన కెరీర్లో ఎన్నో సూపర్‌హిట్లు సినిమాలు చేసినా.. కొన్ని అట్టర్ ఫ్లాపులు కూడా చవిచూశారు. వీటిలో దారుణ ఫలితాన్ని అందించిన సినిమా మహారథి. తమిళ దర్శకుడు పి.వాసు కాంబినేషన్లో స్నేహ, మీరాజాస్మిన్ హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా అట్టర్ ప్లాప్ అయింది. శ్రీ లలిత కళాంజలి ప్రొడక్షన్ బ్యానర్ కింద వాకాడ అప్పారావు నిర్మించిన ఈ సినిమాలో జయప్రద నెగిటివ్ రోల్‌లో కనిపించారు. Also Read: ఈ సినిమా విడుదలై ఇప్పటికి 13ఏళ్లు పూర్తయింది. అయితే ‘మహారథి’ సినిమాతో అప్పుల పాలైన నిర్మాత అప్పారావు ఇప్పటికీ ఆ అప్పులు తీరుస్తూనే ఉన్నారట. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయనే చెప్పారు. ‘ బాలయ్యతో మహారథి సినిమాను ప్రారంభించినప్పుడు చాలామంది ఫైనాన్షియర్లు ముందుకొచ్చారు. తీరా సినిమా షూటింగ్ ప్రారంభమయ్యేటప్పటికి వెనక్కి తగ్గారు. దీంతో నేను నిధులు సమకూర్చుకునే పనిలో పడిన స్ర్కిఫ్ట్ సరిగ్గా పట్టించుకోలేదు.’ Also Read: ఆ తర్వాత నా ఫ్రెండ్ ఒకరు బ్యాంక్ నుంచి రూ.4కోట్ల అప్పు ఇప్పించాడు. కానీ సినిమా దారుణంగా ఫ్లాప్ కావడంతో నేను అప్పుల పాలయ్యాను. ఆ సినిమా కోసం చేసిన అప్పులు ఇప్పటికీ కడుతూనే ఉన్నాను’ అని అప్పారావు చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో బాలకృష్ణ మూడు డిఫరెంట్ పాత్రల్లో నటించారు. అయితే దర్శకుడు పి.వాసు బాలయ్య క్యారెక్టర్స్‌ని ఆయన ఇమేజ్‌కు తగ్గట్టుగా తీర్చిదిద్దకపోవడంతో అట్టర్ ఫ్లాప్‌గా మిగిలింది. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jap0ly
v
No comments:
Post a Comment