Tuesday, 1 September 2020

సిక్స్ ఫ్యాక్స్ అబ్బాయిలు కావాలి.. అలాంటోడు రాత్రంతా! అమ్మాయిలపై పూరి జగన్నాథ్ షాకింగ్ కామెంట్స్

డాషింగ్ డైరెక్టర్ పోడ్ కాస్ట్ ఆడియోలతో తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా బయటపెడుతున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ వేళ వరుస ఆడియోలతో సంచలనం సృష్టిస్తున్న ఆయన సమాజంలోని ఏ ఒక్క అంశాన్ని వదలడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఈ కాలం అమ్మాయిల గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాలేంటో ఆయన మాటల్లోనే చూద్దామా.. ''అమ్మాయిలెప్పుడూ కలల్లో బ్రతుకుతారు. వాస్తవానికి దూరంగా ఎక్కడో డ్రీమ్స్‌లో ఉంటారు. తల్లిదండ్రులు రాకుమారిలా పెంచుతారు. ఆ తర్వాత ఓ ఎదవ తగులుతాడు. నువ్వు నా దేవతవి అంటాడు. అదే నిజం అనుకుంటారు. బట్ బేసికల్‌గా వాళ్లకు మాంచి లాజికల్ బ్రెయిన్ ఉంది. సెక్యూరిటీ చూసుకుంటారు.. ఎక్కువ రిస్కులు చేయరు. ఎక్కువ ప్రేమిస్తారు.. ఎక్కువ ఫీల్ అవుతారు. ఇలా అన్ని మాంచి లక్షణాలే ఉన్నాయి కానీ పొగడ్తలకు పడిపోతారు. పాపం అబ్బాయిలు పక్కింటి అమ్మాయిలతో అడ్జస్ట్ అవుతారు కానీ వీళ్లకు పక్కంటి అబ్బాయిలు సరిపోరు. ఎప్పుడూ సినిమా హీరోలే కావాలి. సిక్స్ ప్యాక్ ఉండాలి.. ఆరడుగులు ఉండాలి. ప్రపంచమంతా వాడిని చూసి భయపడాలి.. అలాంటోడు రాత్రంతా వాళ్ళ కాళ్ళు పట్టాలి. మరి దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు. మీరు సిక్స్ ప్యాక్ ఎదవను పెళ్లి చేసుకున్నా సంసారం అనే బండి చక్రంలో పడి ఆరు నెలలు తిరగకుండా వాడికి ఇంత పెద్ద పొట్ట వస్తుంది. దానికి తోడు వాడు తిండిబోతు కూడా అయితే మూడొంతుల మంచం వాడే నొక్కేస్తాడు. Also Read: ఈ రోజు ఏంజిల్‌లా ఫీలయ్యే అమ్మాయిలంతా ఒకరోజు పందిలా గురకపెట్టే ఎదవ పక్కన పడుకోవాల్సిందే. ఆ సౌండ్ తట్టుకోలేక అమ్మానాన్నల దగ్గరకు పారిపోవాలని ఉంటుంది. ఇది నిజం. ఈ కాలం అమ్మాయిలకు నేను చెప్పేది.. సిక్స్ ఫ్యాక్స్ కోసం వెతకొద్దు. రిచ్ గయ్ కోసం వెయిట్ చేయొద్దు. స్టైల్ కంటే కంఫర్టబుల్ క్లాత్స్ ప్రిఫర్ చేయండి. హీల్స్, లిప్ స్టిక్‌లు తగ్గించండి. ఓ ఐటెం గర్ల్‌లా మిమ్మల్ని మీరు మార్చుకోకండి. లైఫ్‌లో మీ బిగ్గెస్ట్ ఎనిమీ ఓ మగాడై ఉండాలి తప్ప మరో ఆడది కాకూడదు. మగ వెదవలు ఎలా ఆలోచిస్తున్నారా చూడండి. స్ట్రాంగ్ విమెన్‌గా తయారవ్వండి. ఇవ్వన్నీ ఉంటే మొగుడు అవసరం ఉండదు. ఒకవేళ అప్పటికీ కావాలనిపిస్తే అప్పుడు మొగుడి గురించి ఆలోచించండి. అసలు మాట వినని ఎదవ మనకొద్దు. కొంచం మంచోడు.. సిన్సియర్‌గా పనిచేసే మొగుడిని ఎంచుకోండి. అంతేకానీ నువ్వు రాకుమారివి కాదు.. మనకు మాహిష్మతి సామ్రాజ్యం వద్దు.. బాహుబలి అస్సలొద్దు'' అని చెప్పారు పూరి జగన్నాథ్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jxv5rZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...