Friday, 18 September 2020

అవే నిన్ను విలక్షణ నటుడిని చేశాయి: ఉపేంద్రపై నాగబాబు ప్రశంసలు.. అందుకేనా?

కన్నడ విలక్షణ నటుడు ఉపేంద్ర పుట్టినరోజు నేడు. తన 52వ పుట్టినరోజును ఈరోజు ఉపేంద్ర జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వీరిలో మెగా బ్రదర్ , ఆయన కుమారుడు మెగా ప్రిన్స్ కూడా ఉన్నారు. ఉపేంద్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు నాగబాబు. ‘‘పుట్టినరోజు శుభాకాంక్షలు ఉపేంద్ర. ఒక వ్యక్తిగా ప్రయోగాత్మక పాత్రలు చేయడంలో పరిపూర్ణత, ఒక నటుడిగా నువ్వు ఎంపిక చేసుకున్న పాత్రలు, ఇవే నిన్ను విలక్షణ నటుడిని చేశాయి’’ అని నాగబాబు ట్వీట్ చేశారు. అయితే, ఒక కన్నడ నటుడికి నాగబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం, ఆయనపై ప్రశంసల వర్షం కురిపించడం వెనుక కారణం ఉంది. వరుణ్ తేజ్ 10వ సినిమాలో ఉపేంద్ర ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు, మెగా ఫ్యామిలీతో ఉపేంద్రకు సాన్నిహిత్యం ఉంది. అందువల్లే ఉపేంద్రకు ప్రత్యేకంగా నాగబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నాగబాబుతో పాటు వరుణ్ తేజ్ కూడా ఉపేంద్రకు బర్త్‌డే విషెస్ చెప్పారు. ఉపేంద్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వరుణ్ తేజ్ 10వ సినిమా నిర్మాణ సంస్థ రెనసాన్స్ ఫిలింస్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. ‘‘పుట్టినరోజు శుభాకాంక్షలు ఉపేంద్ర సార్. త్వరలోనే మీతో కలిసి షూటింగ్ ప్రారంభించాలని ఎదురుచూస్తున్నాను’’ అని వరుణ్ తేజ్ పేర్కొన్నారు. నిజానికి వరుణ్ తేజ్ సినిమాలో ఉపేంద్ర నటిస్తున్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ ట్వీట్లతో చిత్ర యూనిట్ అధికారికంగా ఖరారు చేసింది. కాగా, ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి ద‌ర్శక‌త్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద, అల్లు వెంక‌టేష్ (బాబీ) నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. జూలై 30న సినిమాను విడుద‌ల చేయాలని మొదట నిర్ణయించారు. కానీ, కరోనా వైరస్ కారణంగా ప్రణాళికలన్నీ తారుమారు అయిపోయాయి. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభంకానుంది. Read Also:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RK1nnD
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...