Thursday, 24 September 2020

అభినందన్ పాత్రలో విజయ్ దేవరకొండ?.. బాలీవుడ్ ఎంట్రీ ఖాయమా!

టాలీవుడ్ యంగ్ హీరో గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ బయటికి వచ్చింది. అర్జున్‌రెడ్డితో భారీ క్రేజ్ సంపాదించుకున్నా ఈ రొమాంటిక్ హీరో ఆ తర్వాత ‘గీతగోవిందం’ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌కూ దగ్గరయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఆశించినంత విజయాలు సాధించకపోయినా అతడి క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘ఫైటర్’ అనే మూవీలో నటిస్తున్న విజయ్ గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. విజయ్ దేవరకొండ త్వరలోనే ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. భారత వింగ్‌కమాండర్‌ అభినందన్ జీవితం ఆధారంగా రూపొందనున్న సినిమాలో నటించేందుకు విజయ్ పచ్చజెండా ఊపినట్లు బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. విజయ్‌తో హిందీ చిత్రం తెరకెక్కించాలని అక్కడి నిర్మాతలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. తాజాగా సంజయ్ లీలా భన్సాలీ, భూషణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించనున్న సినిమాలో విజయ్‌ హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. బాలాకోట్ దాడుల నేపథ్యంలో తెరకెక్కించే ఈ సినిమాలో వింగ్ కమాండర్ అభినందన్‌ పాత్రలో విజయ్ నటించనున్నట్లు సమాచారం. గతేడాది భారత్‌, పాకిస్తాన్‌ సైనికుల మధ్య జరిగిన దాడిలో భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌‌ పాక్ సైన్యానికి చిక్కారు. మూడు రోజుల తర్వాత పాకిస్థాన్ ఆయన్ని భారత ప్రభుత్వానికి అప్పగించింది. శత్రు దేశానికి చిక్కినా ఎంతో ధైర్యంతో వ్యవహరించిన అభినందన్‌పై దేశమంతా ప్రశంసలు కురిపించింది. ఈ ఘటన ఆధారంగా అభిషేక్‌ కపూర్ సినిమా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. స్క్రిప్ట్ నచ్చడంతో విజయ్ దేవరకొండ ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3i3xyZX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...