Thursday, 24 September 2020

పంతం నెగ్గించుకున్న సుకుమార్.. ‘పుష్ప’ షూటింగ్ అక్కడే!

సుకుమార్, కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి తెరకెక్కుతున్న సినిమా ‘పుష్ప’. బన్నీ తన కెరీర్లోనే తొలిసారి విభిన్న పాత్ర పోషిస్తున్నాడు. గంధపు చెక్కల స్మగ్లర్‌‌ పాత్ర కోసం ఆయన డిఫెరెంట్ మేకోవర్‌తో రెడీ అయ్యారు. కథ నేపథ్యంలో ఈ సినిమా అంతా అటవీ ప్రాంతంలోనే తెరకెక్కాల్సి ఉంది. ఇందుకోసం కేరళ అడవులను సెలక్ట్ చేసుకుని షూటింగ్ కూడా మొదలుపెట్టేశారు. తీరా బన్నీ యూనిట్‌తో జతకలిసే సమయానికి లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. దీంతో ఈ సినిమాను ఏపీలోని రంపచోడవరం, తెలంగాణలోని వికారాబాద్, మహబూబ్‌నగర్ అడవుల్లో తెరకెక్కించనున్నారంటూ కొద్దిరోజుల క్రితం ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని కొట్టేసిన సుకుమార్‌ కేరళ అడవుల్లోనే షూటింగ్ జరుగుతుంది క్లారిటీ ఇచ్చారు. కేరళ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిస్తే ప్రేక్షకులకు కొత్తదనం అందించినట్లు ఉంటుందని, బన్నీకి కేరళలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో తమకు కలిసొస్తుందని యూనిట్ భావిస్తోంది. Also Read: దీంతో త్వరలోనే పుష్ప యూనిట్ కేళ అడవుల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతోందట. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్‌ తీర్చిదిద్దేందుకు సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్‌లో మెగాస్టార్ ‘ఆచార్య’ విడుదలయ్యే అవకాశం ఉండటంతో.. ‘పుష్ప’ను మే లేదా జూన్ నెలల్లో రిలీజ్ చేసేలా యూనిట్ యోచిస్తోంది. ఈ సినిమాలో బన్నీ సరసన కన్నడ భామ రష్మిక మందానా నటిస్తోంది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kKr3Nu
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...