డాక్టర్ల కృషి.. కోట్లాది మంచి అభిమానుల పూజలు ఫలించడంతో కోలుకుంటున్నారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వడంతో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. క్రిటికల్ కండిషన్ నుంచి ఆయన కోలుకుంటున్నారని ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మరింత మెరుగుపడిందని చికిత్సకు స్పందిస్తున్నారని చెన్నై ఎంజీఎం వైద్యులు తెలిపారు. కాగా తన తండ్రి ఆరోగ్యానికి సంబంధించి అప్ డేట్స్‌ను ఎప్పటికప్పుడు అభిమానులకు అందిస్తున్న ఎస్పీ తనయుడు చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ‘గత నాలుగు రోజులుగా నాన్నగారి ఆరోగ్యం నిలకడగానే ఉంది. చాలా బెటర్ మెంట్ ఉంది.. దేవుని దయతో ఈ వీకెండ్ వరకు అభిమానులు సంతోషకరమైన వార్త వింటారు. అభిమానులు, ప్రేక్షకుల ఆశీస్సులతో ఆయన కోలుకుంటున్నారు. వీరి ప్రార్థనల ఫలితంగా ఈ సోమవారం ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశాలున్నాయని ఎస్పీ తనయుడు చరణ్ ఇన్ స్టాగ్రామ్‌లో విడుదల చేసిన వీడియోలో తెలిపారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Z4ap38
v
No comments:
Post a Comment