Thursday, 3 September 2020

15 ఏళ్ల కూతురుతో సహా హీరోయిన్ మిస్సింగ్.. పోలీసుల్ని ఆశ్రయించిన భర్త

తమిళ తన 15 ఏళ్ల కూతురుతో సహా అదృశ్యం కావడంతో పోలీసుల్ని ఆశ్రయించాడు ఆమె భర్త. ప్రభు, రాంకీ హీరోలుగా నర్మద హీరోయిన్‌గా 1987లో వచ్చిన ‘చిన్న పూవే మెల్ల పేసు’ చిత్రం అప్పట్లో పెద్ద హిట్ సినిమా. ఈ సినిమా ఎంట్రీ ఇచ్చిన నర్మద.. ఈ ఒక్క సినిమాతోనే తెరమరుగైంది. అయితే చేసిన ఒక్క సినిమాతోనే మంచి పాపులారిటీ దక్కించుకున్నారు నర్మద. ఆ తరువాత కాలంలో సినిమాకు దూరమైన నర్మద.. ప్రముఖ బిజినెస్ మేన్‌ని పెళ్లి చేసుకుని గృహిణిగా స్థిరపడ్డారు. ఇప్పుడు నర్మదకు 15 ఏళ్ల కూతురు ఉంది. అయితే తన భార్య నర్మద, కూతురు కనిపించడం లేదంటూ ఆమె భర్త చెన్నై‌లోని తారాపురం పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. గత రెండు రోజులుగా తన భార్య కనిపించడం లేదని.. తమ మధ్య ఎలాంటి మనస్పర్ధలు గొడవలు లేవని బంధువులు ఇంటి దగ్గర గాలించినా జాడ తెలియకపోవడంతో పోలీసుల్ని ఆశ్రయించనట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు నర్మద భర్త. పోలీసులు దర్యాప్తు చేపట్టగా మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QRiTGf
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...