Friday, 11 September 2020

నిహారిక షాకింగ్ డిసీజన్.. పెళ్లికి ముందే ఇలాంటి నిర్ణయం తీసుకుందేంటి? వాళ్లే కారణమా?

నాగబాబు కూతురు, మెగా డాటర్ మరికొద్ది రోజుల్లో పెళ్ళి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక నిశ్చితార్ధ వేడుక నిరాడంబరంగా నిర్వహించారు కొణిదెల కుటుంబ సభ్యులు. వచ్చే ఏడాది ఆరంభంలో ఆమె పెళ్లి వేడుక నిర్వహించాలని ఫిక్సయ్యారు. అయితే అప్పుడే నిహారిక తన లేటెస్ట్ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం జనాల్లో హాట్ ఇష్యూగా మారింది. అత్తారింటి వాళ్లు వద్దన్నారు గనకే ఈ మూవీ నుంచి ఆమె తప్పుకుందనే కోణంలో చర్చలు నడుస్తున్నాయి. తెలుగులో పలు టీవీ షోస్ లో యాంకరింగ్ చేయడంతో పాటు ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం లాంటి సినిమాలు చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకున్న నిహారిక ఆశించిన ఫలితం రాబట్టలేక పోయింది. దీంతో కోలీవుడ్ తెరపై అయినా సక్సెస్ కావాలనే ఆశతో తమిళంలో స్వాతిని దర్శకత్వంలో అశోక్ సెల్వన్ హీరోగా రూపొందనున్న కొత్త సినిమాలో హీరోయిన్‌గా నటించేందుకు అంగీకరించింది నిహారిక. ఈ సినిమా కోసం రెగ్యులర్‌గా చెన్నై కూడా వెళ్ళొచ్చింది. ఇంతలో అనూహ్యంగా ఈ ప్రాజెక్టు నుంచి నిహారిక లెఫ్ట్ అయినట్లు చిత్ర యూనిట్ చేసిన ప్రకటనతో అంతా షాక్ అయ్యారు. Also Read: తమ సినిమా కోసం నిహారిక స్థానంలో మేఘా ఆకాష్‌ని తీసుకున్నట్లు డైరెక్టర్ స్వాతిని అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చేసింది. దీంతో మెగా డాటర్ తప్పుకోవడం వెనుక కారణాలు విశ్లేషిస్తూ చర్చలు స్టార్ట్ అయ్యాయి. అత్తారింటి వారు పెట్టిన కండీషన్స్ మూలంగానే నిహారిక ఈ నిర్ణయం తీసుకుందని, ఇకపై నిహారిక కెమెరా ముందుకు రావడం కష్టమే అని ఆమె తీసుకున్న ఈ డిసీజన్‌తో కన్ఫర్మ్ అయిందని చెప్పుకుంటున్నారు జనం. సో.. చూడాలి మరి దీనిపై నిహారిక నుంచి గానీ, ఆమె కుటుంబ సభ్యుల నుంచి గానీ ఎలాంటి స్పందన వస్తుందనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3k7Cy1j
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...